డిజాస్టర్ 'థగ్ లైఫ్'.. ఓటీటీ లెక్క మారుతోంది! | Thug Life Movie OTT Latest Details | Sakshi
Sakshi News home page

Thug Life OTT: అనుకున్న టైం కంటే ముందే ఓటీటీలోకి?

Jun 10 2025 2:01 PM | Updated on Jun 10 2025 3:09 PM

Thug Life Movie OTT Latest Details

రీసెంట్ టైంలో ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి ఘోరమైన డిజాస్టర్ అయిన సినిమా 'థగ్ లైఫ్'. తొలిరోజు తొలి ఆటకే ఫలితం ఏంటో తెలిసిపోయింది. రిలీజ్‌కి కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల వార్తల్లో నిలిచిన ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత తేలిపోయింది. ఇప్పుడు వీకెండ్ కూడా పూర్తి కావడంతో చాలాచోట్ల షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. దీంతో టీమ్ పునరాలోచనలో పడిపోయింది. దీంతో ఓటీటీ లెక్క మారే సూచనలు కనిపిస్తున్నాయి.

సాధారణంగా థియేటర్లలోకి వచ్చిన తర్వాత సదరు సినిమా.. ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కావాలనేది ముందే మాట్లాడి అగ్రిమెంట్ చేసుకుంటారు. కమల్ హాసన్ 'థగ్ లైఫ్' చిత్రానికి కూడా నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎనిమిది వారాల తర్వాతే స్ట్రీమింగ్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఉత్తరాదిలోనూ మల్లీప్లెక్స్ రిలీజ్ దక్కింది. తీరా చూస్తే తొలి వీకెండ్‌కే సినిమా ఫలితం ఏంటో తెలిసిపోయింది. దీంతో నిర్మాతలు.. ఓటీటీ సంస్థతో బేరాసారాలు మొదలుపెట్టారట.

ఒప్పందం చేసుకున్నట్లు ఎనిమిది వారాలు కాకుండా నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అడుగుతున్నారట. తద్వారా కొంత మొత్తం ఎక్కువ రాబట్టుకోవాలని నిర్మాతల ఆలోచన. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు నడుస్తున్నాయి. రీసెంట్ టైంలో థియేటర్లలో ఆడని సినిమాలు కూడా ఓటీటీలో హిట్ అవుతున్నాయి. కంగువ, విడామయూర్చి, రెట్రో ఈ కోవలోకే వస్తాయి. బహుశా 'థగ్ లైఫ్' కూడా అలానే ఓటీటీలోకి వచ్చిన తర్వాత ట్రెండ్ అవుతుందేమో చూడాలి? ఏదేమైనా మరికొన్ని రోజుల్లో ఓటీటీ రిలీజ్ విషయంలో క్లారిటీ రావొచ్చు.

'థగ్ లైఫ్' విషయానికొస్తే.. రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ గ్యాంగ్‌స్టర్. అనుకోకుండా తండ్రిని కోల్పోయిన అమర్ (శింబు) అనే కుర్రాడిని శక్తిరాజు పెంచుకుంటాడు. తన తర్వాత తన ముఠాకు అమర్‌ని నాయకుడిగా చేస్తాడు. దీన్ని అదే ముఠాలోని ఇతర సభ్యులు తీసుకోలేకపోతారు. ఇంతలోనే శక్తిరాజుపై హత్యాప్రయత్నం జరుగుతుంది. ఇంతకీ శక్తిరాజుని చంపాలనుకున్నది ఎవరు? ఈ మొత్తం వ్యవహారంలో ఇంద్రాణి, లక్ష‍్మీ పాత్రేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

Advertisement
 
Advertisement
Advertisement