
శ్రద్ధా శ్రీనాధ్, కిశోర్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'కలియుగం-2064'. ఈ సినిమాకు ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే మే 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను ఆర్కే ఇంటర్నేషనల్, ప్రైమ్ సినిమాస్ బ్యానర్లపై కేఎస్ రామకృష్ణ, కే రామ్ చరణ్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు.
తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. జూలై 11 నుంచి సన్ నెక్ట్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 2064లో మనుషులు పరిస్థితి ఏంటనే కోణంలోనే ఈ సినిమాకు రూపొందించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ చిత్రానికి డాన్ విన్సెంట్ సంగీతమందించారు.
When the world ends, who do you become?
Hope, fear, and survival collide in a future gone dark.
Kaliyugam — streaming from 11th July on SunNXT.#KaliyugamOnSunNXT #DystopianDrama #StreamingFromJuly11 #EdgeOfDarkness #Kaliyugam #NewOnSunNXT #FutureUnraveled #WatchItOnSunNXT… pic.twitter.com/DX64AIVYZf— SUN NXT (@sunnxt) July 4, 2025