
ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్స్కు ఫుల్ డిమాండ్ ఉంటోంది. దీంతో ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. తాజాగా మరో థ్రిల్లర్ మూవీ బుల్లితెర ప్రియులను అలరించేందుకు వస్తోంది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కించిన గుడ్ డే (Good Day) మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది. ఓ తాగుబోతు క్రైమ్ ఇన్స్టిగేషన్లో ఎలా సాయపడ్డాడనే కోణంలో ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. సన్ నెక్ట్స్లో ఓటీటీ ప్లే ప్రీమియం ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది జూన్ 27న గుడ్ డే థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పోర్ణా జేఎస్ మైఖేల్ కథ అందించగా.. ఈ సినిమాకు ఎన్ అరవిందన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ రామలింగం, మైనా నందిని, ఆదుకలం మురుగదాస్, కాళి వెంకట్, భగవతి పెరుమాల్, వేళ రామమూర్తి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి గోవింద్ వసంత గుడ్ డేకు సంగీతం అందించారు.
Freedom to binge exactly what you want – Good Day, Gamblers, Akkenam.
Why choose one when Ungal Screen, Ungal Choice on Ungal Sun NXT!! #UngalScreenUngaChoice #SunNXT #GoodDay #Gamblers #Akkenam #WeekendBinge #MovieDrop #IndependenceDayWeekend #FreedomToBinge,… pic.twitter.com/JEieC1LhJv— SUN NXT (@sunnxt) August 10, 2025