
కోలీవుడ్ నటుడు సత్యరాజ్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మద్రాస్ మ్యాట్నీ. ఈ సినిమాకు కార్తికేయన్ మణి దర్శకత్వం వహించారు. జూన్ 6న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ సమర్పణలో మెడ్రాస్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
ఎలాంటి ప్రకటన లేకుండానే ఏకంగా నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 4 తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌తో పాటు సన్ నెక్స్ట్, టెంట్‌కొట్టా, సింప్లీ సౌత్ ఫ్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజై నెల రోజులు కాకముందే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది ఈ సినిమా. మద్రాస్ మ్యాట్నీ చిత్రంలో మిడిల్ క్లాస్ లైఫ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ కథను యథార్థంగా తెరపై ఆవిష్కరించారు. ఈ చిత్రానికి బాలా సారంగన్ సంగీతం అందించారు.
Recent Tamil Feel Good Movie ❤️✨ #MadrasMatinee streaming from Tonight on PrimeVideo, Tentkotta, Sunnxt & SimplySouth 🍿!!@kaaliactor @keyanmk
@Roshni_offl @gk_anand@cinemapayyan#OTT_Trackers pic.twitter.com/TlyWKLW4Xv— OTT Trackers (@OTT_Trackers) July 3, 2025