ఒక రోజు ముందుగానే ఓటీటీకి వచ్చిన సూపర్ హిట్ మూవీ | Tovino Thomas Action Thriller Streaming On This Ott One day before | Sakshi
Sakshi News home page

Tovino Thomas: ముందుగానే ఓటీటీకి వచ్చేసిన టోవినో థామస్ హిట్ మూవీ

Jul 10 2025 3:21 PM | Updated on Jul 10 2025 3:57 PM

Tovino Thomas Action Thriller Streaming On This Ott One day before

మలయాళీ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్‌ 'నరివెట్ట'. ఈ చిత్రానికి అనురాగ్ మనోహర్ దర్శకత్వం వహించారు. తెలుగులో మే 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. 2003లో జరిగిన ముతంగ సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఐడెంటిటీ హిట్ తర్వాత టోవినో థామస్ మరో మూవీని సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సోనీ లివ్ వేదికగా నరివెట్ట మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఇంకేందుకు ఆలస్యం ఈ బ్లాక్‌బస్టర్‌ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. కాగా..  ఈ చిత్రంలో వెంజరమూడు, చేరన్ కీలక పాత్రల్లో నటించారు. కాగా.. ఈ  సినిమాలో టొవినో థామస్ పోలీస్ కానిస్టేబుల్‌గా నటించారు. ఈ ఏడాది మే 23న మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. తెలుగులోనూ మే 30న రిలీజైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement