Comedian Soori: హీరోగా మారిన కమెడియన్‌.. రెండు భాగాలుగా సినిమా

Kollywood Comedian Soori Becomes Hero - Sakshi

వెన్నెలా కబడి కుళు చిత్రం ద్వారా చిన్న పాత్రలో పరిచయమైన నటుడు సూరి. ఆ చిత్రంలో సూరి కామెడీ అందరినీ ఆకర్షించింది. దీంతో ఆయనకు వరుసగా అవకాశాలు లభించాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రముఖ హాస్యనటుడి స్థాయికి ఎదిగాడు. ఇంకేముంది ఆ క్రేజ్‌ సూరిని కథానాయకుడిని చేసేసింది. ఆర్‌ఎస్‌ ఇన్ఫోటెయిన్‌మెంట్‌ పతాకంపై ఎల్‌ రెడ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రంలో సూరి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.

వెట్రిమాన్‌ దర్శకత్వంలో విడుదలై పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. సూరి హీరోగా నటిస్తున్న తొలి చిత్రమే రెండు భాగాలుగా రూపొందించడం విశేషం. ఇందులో నటుడు ప్రధాన పాత్రలో నటించడం మరో విశేషం. కాగా ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే ఈయనకు హీరోగా అవకాశాలు వరుస కడుతున్నాయి.

మదయానై చిత్రం ఫేమ్‌ విక్రమ్‌ సుకుమార్‌ నటుడు సూరి హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు మరో చిత్రంలోనూ సూరి హీరోగా నటించడానికి సిద్ధమవుతున్నారు. దీంతో విడుదలై చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా దర్శకుడు వెట్రిమారన్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా హాస్యనటులుగా పేరుతెచ్చుకుని హీరోల అవతారమెత్తిన వడివేలు, సంతానం వంటి వాళ్లు ఇప్పుడు మళ్లీ మొదటికే వస్తున్నారు. మరి హీరోగా సూరి భవిష్యత్‌ ఎలా ఉంటుందో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top