విజయ్ సేతుపతి 'విడుదల 2' సాంగ్‌ రిలీజ్‌ | Viduthalai 2 Pavurama Pavurama Song Out Now | Sakshi
Sakshi News home page

విజయ్ సేతుపతి 'విడుదల 2' సాంగ్‌ రిలీజ్‌

Nov 23 2024 6:46 PM | Updated on Nov 23 2024 7:02 PM

Viduthalai 2 Pavurama Pavurama Song Out Now

విజయ్‌ సేతుపతి, సూరి ప్రధాన పాత్రధారులుగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విడుదల2. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి సాంగ్‌ ' పావురమా పావురమా' మేకర్స్‌ విడుదల చేశారు. గతేడాదిలో రిలీజైన విడుదల చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ డిసెంబర్‌ 20న విడుదల కానుంది. తెలుగు హక్కులను  ప్రముఖ నిర్మాత , శ్రీ  వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. 'సంగీత మాంత్రికుడు ఇళయరాజా స్వరపరిచిన 'విడుదల 2' చిత్రంలోని తొలిపాటను  తాజాగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. కాసర్ల శ్యామ్ కలం నుంచి వెలువడిన ఈ పాటను తెలుగు ప్రేక్షకులు ఇంత స్పీడుగా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్‌గా విడుదల2 ప్రేక్షకులను  కనువిందు చేయబోతోంది.

ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రిమారన్, ఎన్నో  సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ అధినేత   ఎల్రెడ్  కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు.   మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ చిత్ర హక్కులను మేము దక్కించుకున్నందుకు సంతోష పడుతున్నాం. డిసెంబర్ 20న ఇండియన్ సెల్యూలాయిడ్ పై ప్రేక్షకులంతా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.' అని ఆయన తెలిపారు.

విజయ్‌ సేతుపతి, మంజు వారియర్ విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, భవాని శ్రీ,  గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్,రాజీవ్ మీనన్, ఇలవరసు , బాలాజీ శక్తివేల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement