సూరి సినిమాలో హీరోయిన్‌గా 'డ్యూడ్‌' బ్యూటీ! | Mamitha Baiju to play Female Lead in Soori Movie? | Sakshi
Sakshi News home page

స్పీడు మీదున్న 'డ్యూడ్‌' హీరోయిన్‌.. మరో సినిమాలో ఛాన్స్‌!

Apr 1 2026 8:24 AM | Updated on Apr 1 2026 9:02 AM

Mamitha Baiju to play Female Lead in Soori Movie?

సినిమా ఎవరిని ఎప్పుడు? ఏ స్థాయిలో నిలబెడుతుందో చెప్పలేం. అప్పటివరకు ప్రయత్నలోపం లేకుండా శ్రమిస్తూనే ఉండాలి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సహాయనటుడి నుంచి హాస్యనటుడిగా ఎదిగి ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌ హీరోగా రాణిస్తున్నాడు నటుడు సూరి. విడుదలై మూవీతో హీరోగా ట్రాక్‌ ఎక్కిన ఈయన ఇటీవల విడుదలైన మామన్‌ మూవీ వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.

కమెడియన్‌ నుంచి హీరోగా..
ప్రస్తుతం ఇతడు మండాడి సినిమా చేస్తున్నాడు. సముద్రతీరంలో జాలర్ల పడవల పోటీ నేపథ్యంలో రూపొందుతున్న కథా చిత్రమిది. మదిమారన్‌ పుహళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ మూవీ తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోంది. ఇది నిర్మాణంలో ఉండగా మరో సినిమాకు కమిటయ్యాడు సూరి.

రియల్‌ స్టోరీ ఆధారంగా మూవీ
రవికుమార్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్‌ నిర్మించనుంది. 2015లో చెన్నైలో బీభత్సం సృష్టించిన వరదల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం. ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో సూరికి జంటగా మమిత బైజు హీరోయిన్‌గా నటించనున్నట్లు వినికిడి. ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ డ్యూడ్‌ సినిమాతో మరో హిట్‌ అందుకుంది. 

హీరోయిన్‌ ఎవరంటే?
విజయ్‌ హీరోగా నటించిన జననాయకన్‌లోనూ కీలక పాత్ర పోషించింది. సూర్యకు జంటగా విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌, ధనుష్‌తో కర సినిమాలు చేసింది. ఇవన్నీ త్వరలోనే రిలీజ్‌ కానున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సూరితో మమిత బైజు జోడీ కట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!

Advertisement
 
Advertisement
Advertisement