యాక్షన్‌ మండాడి | Mandaadi was scheduled to release in theatres on 10 September 2026 | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ మండాడి

Jul 22 2026 12:14 AM | Updated on Jul 22 2026 12:14 AM

Mandaadi was scheduled to release in theatres on 10 September 2026

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మండాడి’. ఆర్‌ఎస్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ పతాకంపై మదిమారన్‌ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న రిలీజ్‌ కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఎల్‌ఎల్‌పీ రిలీజ్‌ చేస్తోంది.

‘‘ఈ సినిమా కోసం సుహాస్, సూరి బాగా మేకోవర్‌ అయ్యారు. ఈ చిత్రంలోని బోట్‌ సీక్వెన్స్‌లు, యాక్షన్‌ సీక్వెన్స్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అని యూనిట్‌ పేర్కొంది. మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మణికందన్‌ సహ–నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement