breaking news
anuska sharma
-
హోమియో Vs అల్లోపతి : అగ్గి రాజేసిన అనుష్క శర్మ పోస్ట్
బాలీవుడ్ హీరోయిన్,స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ తాజా సోషల్ మీడియా పోస్ట్ దుమారం రేపుతోంది. హోమియోపతి వైద్యాన్ని సమర్ధిస్తూ, ఒక వైద్యుడి వీడియోను ఆమె పంచుకున్నారు. తన జీవితంలో హోమియోపతి ముఖ్యమైన పాత్ర పోషించిందంటూ ఈ వీడియోను షేర్ చేయడంతో నెట్టింట అగ్గి రాజుకుంది. అనుష్కకు సపోర్ట్‌గా కొందరు, వ్యతిరేకంగా కొందరు నెటిజన్లు రెండుగా విడిపోయారు.నమిత థాపర్‌తో డాక్టర్ రాజన్ శంకరన్ జరిపిన సంభాషణ క్లిప్‌ను అనుష్క ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఆరోగ్యం , హెల్దీ జీవనవిధానానికి తాను ప్రాధానత్య ఇస్తానని, డా. రాజన్ సూచనలు, సలహాలకు ఎంతో విలువ ఇస్తానని తెలిపింది. తన జీవితంలో హోమియోపతి ఒక ముఖ్యమైన పాత్ర పోషించిందనీ, అందులో డాక్టర్ రాజన్ శంకరన్ ఒక కీలకమైన భాగమని పేర్కొంది. దీంతో నెట్టింట సందడి మొదలైంది.Virat Kohli’s wife, Anushka Sharma is recommending homeopathy to Indians.Fraud babas are not enough, she is now promoting unscientific fraud medicine to IndiansGive them enough money and they might one day tell people, “Just visit Premanand Maharaj to cure all your diseases.” pic.twitter.com/5L6y8Wcxa6— Mohit Chauhan (@mohitlaws) June 2, 2026దుమ్మెత్తిపోసిన నెటిజన్లుఇక్కడ ఉన్న దొంగ బాబాలు చాలదన్నట్టు, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అశాస్త్రీయమైన నకిలీ వైద్య విధానాన్ని ప్రమోట్ చేస్తోందంటూ అనుష్క శర్మ వైఖరిని తప్పుబడుతూ కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అంతేకాదు డబ్బులిస్తే ఏదైనా చెబుతారంటూ మండిపడ్డారు. 60 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న నటి హోమియోపతిని ప్రమోట్ చేయడం మరికొందరు విమర్శలు గుప్పించారు. నమ్మకం పేరుతో సరైన అల్లోపతి వైద్యం తీసుకోకుండా, చనిపోయిన చాలా మందిని చూశాను. ఇకపై తాను అనుష్క ఫ్యాన్‌గా ఉండదలుచుకోలేదని ఒకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు అనుష్క స్టోరీ చూస్తే రక్తం మరుగుతోంది. ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉండి హోమియోపతిని ఎలా ప్రమోట్ చేస్తారు? వీరికి ఏదైనా పెద్ద జబ్బు వస్తే హోమియోపతి లేదా ఆయుర్వేదం దగ్గరికి వెళ్తారా? ఇలాంటి ప్రచారాల వల్లే ప్రజలు ప్రాణాంతక వ్యాధులు ముదిరిపోయే వరకు హోమియోపతి వాడుతూ, చివరి దశలో అల్లోపతి ఆసుపత్రులకు వస్తున్నారని ఒక నెటిజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: 7 సార్లు TEDX స్పీకర్ ఈ ‘ఆటో అన్న’ నెట్టింట సందడిఅనుష్కకు మద్దతుగా మరికొందరు మరోవైపు, అనుష్క శర్మ వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవించాలంటూ . హోమియోపతి వల్ల తమకు జరిగిన మేలును వివరిస్తూ చాలా మంది ఆమెకు, హోమియో వైద్య విధానానికి మద్దతుగా నిలిచారు అందరూ ఆ డాక్టర్ లేదా బాబా దగ్గరికే వెళ్లాలని ఆమె ఎక్కడా చెప్పలేదు ఒకరు, కొన్నిసార్లు అల్లోపతి కూడా నయం చేయలేని వ్యాధులను హోమియోపతి నయం చేస్తుందని ఒకరు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరూ అల్లోపతి వైద్యులే. కానీ నాకున్న దీర్ఘకాలిక చర్మ సమస్య కోసం రెండేళ్లు మోడరన్ మెడిసిన్ వాడినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు గత రెండున్నర నెలలుగా హోమియోపతి వాడుతున్నాను, నాలో చాలా మార్పు కనిపిస్తోంది" అని ఒకరు తన అనుభవాన్ని పంచుకున్నారు. నన్ను ట్రోల్ చేశారుదీనికి హోమియోపతి వైద్యులు కూడా స్పందించడం గమనార్హం. హోమియోపతి డాక్టర్ని అని చెప్తేనే ఎక్స్‌లో తనను చాలా ట్రోల్ చేశారంటూ ఒక హోమియోపతి వైద్యుడు కూడా అనుష్కకు మద్దతుగా సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చారు. ఇదీ చదవండి: కజిన్ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్.. చూడలేం! -
గో డిజిట్ ఐపీవోకు బ్రేక్
సాక్షి, ముంబై: ప్రయివేట్ రంగ బీమా సంస్థ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీవో ప్రణాళికలకు సెబీ చెక్ పెట్టింది. ప్రాస్పెక్టస్‌ను తిప్పి పంపింది. దీంతో అవసరమైన తాజా సమాచారాన్ని జత చేస్తూ ముసాయిదా పత్రాలను తిరిగి దాఖలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. వెరసి కెనడియన్ కంపెనీ ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్‌నకు పెట్టుబడులున్న గో డిజిట్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కంపెనీ 2022 ఆగస్ట్‌లో సెబీకి తొలుత ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. వీటి ప్రకారం ఐపీవో ద్వారా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 10.94 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీలో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, ఆయన భార్య, నటి అనుష్క శర్మకు వాటాలున్న సంగతి తెలిసిందే. కంపెనీ మోటార్, ట్రావెల్, హెల్త్, ప్రాపర్టీ తదితర పలు బీమా ప్రొడక్టులను ఆఫర్ చేస్తోంది. -
స్టార్ క్రికెటర్ బయోపిక్‌లో అనుష్క..?
ముంబై: భారత చలన చిత్ర రంగంలో ఇటీవలి కాలంలో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రముఖ క్రీడాకారుల జీవిత చరిత్రలపై వరుసపెట్టి సినిమాలు తెరకెక్కుతున్నాయి. కొంతకాలం క్రితం టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ’ తెరకెక్కగా, తాజాగా టీమిండియా మహిళా జట్టు పేసర్ ఝులన్ గోస్వామి బయోపిక్ అభిమానుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఝులన్ గోస్వామి పాత్రలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ నటించనున్నట్లు బీటౌన్ వర్గాల సమాచారం. కాగా, గతేడాది జనవరిలో అనుష్కశర్మ టీమిండియా జెర్సీలో కనిపించినప్పటి నుంచి ఝులన్ గోస్వామి బయోపిక్ అంశంపై వార్తలు గుప్పుమంటున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఝులన్‌తో కలిసి అనుష్క కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హంగామా అనే మ్యాగజీన్ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అంశాన్ని ప్రచురించింది. ఈ ఏడాది చివరినాటికి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 38 ఏళ్ల ఝులన్ గోస్వామి.. 2002లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. ఆమె భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో 330కి పైగా వికెట్లు పడగొట్టింది. మహిళల క్రికెట్లో ఆమె దాదాపు రెండు దశాబ్దాలుగా రాణిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత మహిళల జట్టులో గోస్వామి సభ్యురాలిగా ఉంది. త్వరలోనే భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు దేశాల మధ్య జరిగిన ఏకైక టెస్టు డ్రా కాగా, మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో భారత్ చేజార్చుకుంది. ఈ నెల 9 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. -
సాక్షి ధోని 'వన్ మోర్ సిక్స్' వైరల్ వీడియో
-
క్యా బాత్ హై!
బాలీవుడ్లో భామల మధ్య సయోధ్య పెద్దగా ఉండదని ఎవరన్నారో గానీ... పిక్చర్ చూస్తే ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందే! మెగా హిట్స్‌తో దూసుకుపోతున్న అనుష్కాశర్మా, దీపికా పడుకొనే... ఓ సందర్భంలో రీసెంట్గా కలిసినప్పుడు షేర్ చేసుకున్న మూమెంట్ ఇది. అనుష్క ఒకప్పటి బాయ్‌ఫ్రెండ్... దీపిక ప్రజంట్ ‘డేట్స్'మ్యాన్ ఒక్కరే... రణవీర్‌సింగ్! తారలిద్దరికీ పడదని... కత్రినకైఫ్తో కలసి అనుష్కా ఆ మధ్య దీపికపై కామెంట్స్ కూడా చేసిందని ఓ రూమర్! అయితే... తమ మధ్య అలాంటిదేమీ లేదని చెప్పకనే చెప్పారు ఈ బ్యూటీస్. ‘ఎన్‌హెచ్ 10’లో అనుష్క యాక్టింగ్ అద్భుతమని దీపిక కొనియాడిందట! ఆమెను ఇలా ముద్దుగా ముద్దు పెట్టుకుని ఆప్యాయతనూ చాటి ఆశ్చర్యపరిచింది దీపిక!


