హోమియో Vs అల్లోపతి : అగ్గి రాజేసిన అనుష్క శర్మ పోస్ట్‌ | Homeopathy Vs allopathy Internet Clashes Over Anushka Sharmas Post | Sakshi
Sakshi News home page

హోమియో Vs అల్లోపతి : అగ్గి రాజేసిన అనుష్క శర్మ పోస్ట్‌

Jun 3 2026 2:44 PM | Updated on Jun 3 2026 2:52 PM

 Homeopathy Vs allopathy Internet Clashes Over Anushka Sharmas Post

బాలీవుడ్‌ హీరోయిన్‌,స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ భార్య అనుష్క శర్మ తాజా సోషల్ మీడియా పోస్ట్‌ దుమారం రేపుతోంది. హోమియోపతి వైద్యాన్ని సమర్ధిస్తూ, ఒక వైద్యుడి వీడియోను  ఆమె పంచుకున్నారు.  తన జీవితంలో హోమియోపతి ముఖ్యమైన పాత్ర పోషించిందంటూ ఈ వీడియోను షేర్‌ చేయడంతో నెట్టింట అగ్గి రాజుకుంది.  అనుష్కకు సపోర్ట్‌గా కొందరు, వ్యతిరేకంగా కొందరు నెటిజన్లు రెండుగా విడిపోయారు.

నమిత థాపర్‌తో డాక్టర్ రాజన్ శంకరన్ జరిపిన సంభాషణ క్లిప్‌ను  అనుష్క ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ఆరోగ్యం ,  హెల్దీ జీవనవిధానానికి తాను ప్రాధానత్య ఇస్తానని,  డా. రాజన్‌ సూచనలు, సలహాలకు ఎంతో విలువ ఇస్తానని తెలిపింది. తన  జీవితంలో హోమియోపతి ఒక ముఖ్యమైన పాత్ర పోషించిందనీ, అందులో  డాక్టర్ రాజన్ శంకరన్ ఒక కీలకమైన భాగమని పేర్కొంది.  దీంతో నెట్టింట సందడి మొదలైంది.

దుమ్మెత్తిపోసిన నెటిజన్లు
ఇక్కడ ఉన్న దొంగ బాబాలు చాలదన్నట్టు,  విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అశాస్త్రీయమైన నకిలీ వైద్య విధానాన్ని ప్రమోట్ చేస్తోందంటూ అనుష్క శర్మ వైఖరిని తప్పుబడుతూ కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.   అంతేకాదు డబ్బులిస్తే ఏదైనా చెబుతారంటూ మండిపడ్డారు.

 

60 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న  నటి హోమియోపతిని ప్రమోట్ చేయడం మరికొందరు విమర్శలు  గుప్పించారు. నమ్మకం పేరుతో సరైన అల్లోపతి వైద్యం తీసుకోకుండా, చనిపోయిన చాలా మందిని  చూశాను. ఇకపై తాను అనుష్క ఫ్యాన్‌గా ఉండదలుచుకోలేదని ఒకరు వ్యాఖ్యానించారు.

అంతేకాదు అనుష్క స్టోరీ చూస్తే రక్తం మరుగుతోంది. ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉండి హోమియోపతిని ఎలా ప్రమోట్ చేస్తారు? వీరికి ఏదైనా పెద్ద జబ్బు వస్తే హోమియోపతి లేదా ఆయుర్వేదం దగ్గరికి వెళ్తారా? ఇలాంటి ప్రచారాల వల్లే ప్రజలు ప్రాణాంతక వ్యాధులు ముదిరిపోయే వరకు హోమియోపతి వాడుతూ, చివరి దశలో అల్లోపతి ఆసుపత్రులకు వస్తున్నారని ఒక నెటిజన్ ఆందోళన వ్యక్తం చేశారు.  

ఇదీ చదవండి: 7 సార్లు TEDX స్పీకర్ ఈ ‘ఆటో అన్న’ నెట్టింట సందడి

అనుష్కకు మద్దతుగా మరికొందరు 
మరోవైపు, అనుష్క శర్మ వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవించాలంటూ . హోమియోపతి వల్ల తమకు జరిగిన మేలును వివరిస్తూ చాలా మంది ఆమెకు, హోమియో వైద్య విధానానికి మద్దతుగా నిలిచారు అందరూ ఆ డాక్టర్ లేదా బాబా దగ్గరికే వెళ్లాలని ఆమె ఎక్కడా చెప్పలేదు ఒకరు, కొన్నిసార్లు అల్లోపతి కూడా నయం చేయలేని వ్యాధులను హోమియోపతి నయం చేస్తుందని ఒకరు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరూ అల్లోపతి వైద్యులే. కానీ నాకున్న దీర్ఘకాలిక చర్మ సమస్య కోసం రెండేళ్లు మోడరన్ మెడిసిన్ వాడినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు గత రెండున్నర నెలలుగా హోమియోపతి వాడుతున్నాను, నాలో చాలా మార్పు కనిపిస్తోంది" అని ఒకరు తన అనుభవాన్ని పంచుకున్నారు.   

నన్ను ట్రోల్‌ చేశారు
దీనికి హోమియోపతి వైద్యులు కూడా స్పందించడం గమనార్హం.  హోమియోపతి డాక్టర్‌ని అని చెప్తేనే ఎక్స్‌లో  తనను చాలా ట్రోల్‌ చేశారంటూ ఒక హోమియోపతి వైద్యుడు కూడా అనుష్కకు మద్దతుగా సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చారు. 
ఇదీ చదవండి: కజిన్‌ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్‌.. చూడలేం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement