కజిన్‌ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్‌.. చూడలేం! | UP Jitendra Pathak throws boy to the ground eight times over obsession | Sakshi
Sakshi News home page

కజిన్‌ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్‌.. చూడలేం!

Jun 2 2026 2:52 PM | Updated on Jun 2 2026 3:20 PM

UP Jitendra Pathak throws boy to the ground eight times over obsession

ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ఘోరమైన, కలచివేసే ఘటన వెలుగుచూసింది. ఫిరోజాబాద్‌లోని యాదవ్ కాలనీలో శనివారం (మే 30)  జితేంద్ర పాఠక్ అలియాస్ విరాజ్ (24) అనే వ్యక్తి, ఆరవ్ అనే ఒకటిన్నర ఏళ్ల చిన్నారిని అత్యంత అమానుషంగా నేలకేసి కొట్టి చంపాడు.

స్థానిక మహిళను పెళ్లి చేసుకోవాలని భావించాడు నిందితుడు జితేంద్ర. అయితే దీన్ని ఆమె తిరస్కరించడంతో  విచక్షణ మరచిన రాక్షసుడిలా మారిపోయాడు.  అమాయక  బాలుడిని దారుణంగా ఉన్మాదిలా  పదే పదే నేలకేసి విసిరి కొట్టాడు. ఎనిమిది సార్లు నేలకేసి కొట్టడంతో,  చిన్నారిఅక్కడికక్కడే ప్రాణాలొదొలేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అమానుష ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

 నిందితుడు జితేంద్ర పాఠక్ ఒక కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అతను తన కజిన్ సుమిత్ భార్య, చిన్నారి తల్లి , రతీ దేవిపై మోహాన్ని పెంచుకున్నాడు. రతి, సుమిత్ గత కొంతకాలంగా విడిగా ఉంటుండగా, రతి విడాకుల వ్యవహారాల్లో జితేంద్ర సహాయం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమెపై ప్రేమను పెంచుకుని పెళ్లి ప్రతిపాదనలు చేయగా, రతి వాటిని నిరంతరం తిరస్కరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లి పింకీ దేవితో కలిసి విడాకుల చట్టపరమైన సంప్రదింపుల కోసం షికోహాబాద్ వెళ్లారు. జితేంద్ర వారిని వెంబడించి అక్కడ కూడా పెళ్లి ప్రపోజల్ పెట్టగా, ఆమె నిరాకరించింది. రతి తనను పెళ్లి చేసుకోకపోవడానికి ఆ చిన్నారే ప్రధాన అడ్డంకి అని నిందితుడు భావించి, ఆ దురాగతానికి పాల్పడినట్టు  పోలీసుల విచారణలో తేలింది.

శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో టాఫీ (చాక్లెట్) కొనిస్తానని చెప్పి చిన్నారి ఆరవ్‌ను జితేంద్ర లోబరుచుకున్నాడు. తీవ్రమైన ఉన్మాదంతో ఊగిపోయిన జితేంద్ర, ఆ పసికందును పైకెత్తి దాదాపు ఎనిమిది సార్లు కిరాతకంగా నేలకేసి కొట్టాడు. ఈ దారుణమైన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.

స్థానికులు గమనించి అడ్డుకునేలోపే ఘోరం జరిగిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.  కేసు నమోదైంది. ఆదివారం (మే 31) మైన్‌పురి రోడ్డు సమీపంలో పోలీసులకు, నిందితుడికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల (ఎన్‌కౌంటర్) అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. 

ఇదీ చదవండి: ఇద్దరు అమ్మాయిల పెళ్లి : అదిరిపోయే ట్విస్ట్‌ ఏంటంటే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement