ఇద్దరు అమ్మాయిల పెళ్లి : అదిరిపోయే ట్విస్ట్‌ ఏంటంటే..! | After gender transition surgery cousin marriage goes viral | Sakshi
Sakshi News home page

ఇద్దరు అమ్మాయిల పెళ్లి : అదిరిపోయే ట్విస్ట్‌ ఏంటంటే..!

Jun 2 2026 12:48 PM | Updated on Jun 2 2026 1:06 PM

After gender transition surgery cousin marriage goes viral

బిహార్‌లోని జముయి జిల్లాలో జరిగిన ఒక వింత వివాహం ప్రస్తుతం నెట్టింట  వైరల్‌గా మారింది.  బీపీఎస్సీ (BPSC) ఉపాధ్యాయురాలు తోబుట్టువు వరుసైన (బాబాయ్ కూతురు/మేనత్త కొడుకు)ను వివాహమాడింది.  ఈ స్టోరీలో ట్విస్ట్‌ అర్థం కావాలంటే పూర్తి కథనం చదవాల్సిందే. 

2025లో బీపీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, లక్ష్మీపూర్ బ్లాక్‌లోని మేద్నీపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తోంది వధువు నయన్‌శ్రీ. తన చిరకాల ప్రియురాల్ని తన కజిన్ (సొంత మేనత్త కూతురు) రాఖీ అలియాస్‌ రాహుల్‌ని వివాహం చేసుకుంది.  

విషయం ఏమిటంటే రాఖీ సుమారు ఆరు నెలల క్రితం ఎయిమ్స్-ఢిల్లీలో జరిగిన లింగమార్పిడి శస్త్రచికిత్స తర్వాత రాహుల్‌గా మారాడు.  రాఖీని ఆమె పెళ్లి చేసుకుంది.   ఈ సర్జరీ కోసం  నయన్‌శ్రీ  రూ. 8 లక్షల బ్యాంకు రుణం తీసుకుంది.   అన్నీ సవ్యంగా ముగిసిన  తర్వాత మే 31న ఒక ఆలయంలో జరిగిన వేడుకలో  ఇద్దరూ అగ్నిసాక్షిగా ఏడడుగులు  నడిచి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.  లక్ష్మీపూర్‌లోని పటేశ్వర్ నాథ్ ఆలయంలో వీరి వివాహం జరిగింది. వీరు  నడిచారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ఐదేళ్ల లవ్‌
నయన్‌శ్రీ తండ్రి బిహార్ సచివాలయంలో ఉద్యోగి, తల్లి గృహిణి. రాహుల్‌/రాఖీ తండ్రి కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. నయన్‌శ్రీ తల్లి, రాఖీ తండ్రి తోబుట్టువులు. వారు లక్ష్మీపూర్ బ్లాక్‌లో సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు చెందినవారు. నయన్ శ్రీ, రాఖీ ఇద్దరూ చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. 2019లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, డిగ్రీ సమయంలో ఒకే హాస్టల్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2023లో BPSC పరీక్షల ప్రిపరేషన్ కోసం పాట్నా వెళ్లారు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుండే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచారు.

లక్ష్మీపూర్ వార్డు సభ్యుడు రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నయన్ శ్రీ తన ప్రభుత్వ ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని భావించి, తాను లింగమార్పిడి చేయించుకోకుండా, రాఖీని (రాహుల్) చేయించుకోమని కోరింది. అందుకోసం ఆమె తన పేరు మీద రూ. 8 లక్షల బ్యాంక్ లోన్ కూడా తీసుకుంది.

కుటుంబంలో గొడవలు
రాహుల్ మే నెలలో ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చే వరకు ఈ సర్జరీ విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. మే 31న రాహుల్ మొబైల్ ఫోన్ కొంటానని చెప్పి బయటకు వెళ్లి నయన్ శ్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన విషయం తెలిసి నయన్ శ్రీ తల్లిదండ్రులు రాహుల్ ఇంటికి వచ్చి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో ఇంటి గేటును కూడా ధ్వంసం చేశారు. దీంతో భయపడిన కొత్త జంట ఇంటి వెనుక తలుపు నుండి తప్పించుకుని, ప్రస్తుతం ఎవరికీ తెలియని రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. అయితే, ఈ వివాహం ఇద్దరి పరస్పర అంగీకారంతోనే జరిగిందని బంధువులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement