గో డిజిట్‌ ఐపీవోకు బ్రేక్‌

Sebi returns Go Digit General Insurance IPO papers firm to refile - Sakshi

     సెబీ నుంచి ప్రాస్పెక్టస్‌ వెనక్కి 

సాక్షి, ముంబై:  ప్రయివేట్‌ రంగ బీమా సంస్థ గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపీవో ప్రణాళికలకు సెబీ చెక్‌ పెట్టింది. ప్రాస్పెక్టస్‌ను తిప్పి పంపింది. దీంతో అవసరమైన తాజా సమాచారాన్ని జత చేస్తూ ముసాయిదా పత్రాలను తిరిగి దాఖలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. వెరసి కెనడియన్‌ కంపెనీ ఫెయిర్‌ఫాక్స్‌ గ్రూప్‌నకు పెట్టుబడులున్న గో డిజిట్‌ ఇన్సూరెన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

కంపెనీ 2022 ఆగస్ట్‌లో సెబీకి తొలుత ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. వీటి ప్రకారం ఐపీవో ద్వారా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 10.94 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు.

కంపెనీలో క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లీ, ఆయన భార్య, నటి అనుష్క శర్మకు వాటాలున్న సంగతి తెలిసిందే. కంపెనీ మోటార్, ట్రావెల్, హెల్త్, ప్రాపర్టీ తదితర పలు బీమా ప్రొడక్టులను ఆఫర్‌ చేస్తోంది.  

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top