breaking news
inlaws
-
నగ్నంగా ఊరేగించిన మహిళకు సీఎం భరోసా
జైపూర్: రాజస్థాన్‌లో ఒక మహిళను వివస్త్రను చేసిన సంఘటన విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు అప్పగించామని బాధితురాలి భర్తతో సహా మరో 10 మందిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఈ సందర్బంగా బాధితురాలికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం తోపాటు ఒక ఉద్యోగాన్ని కూడా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన మరువక ముందే రాజస్థాన్‌లో అలాంటి మరో సంఘటన చోటు చేసుకుంది. ప్రతాప్‌గఢ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కన మీనా అనే వ్యక్తి తన భార్యకి పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధముందని అనుమానించి పది మంది చూస్తుండగా ఆమెను ఒకపక్క కొడుతూ వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించాడని తెలిపారు. బాధితురాలి అత్తమామలు ప్రోద్బలంతోనే మీనా ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని వారు తెలిపారు. సంఘటన వెలుగులోకి రాగానే వీడియో వైరల్ కావడంతో పాటు దీనిపై రాజకీయ రగడ కూడా మొదలవడంతో స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు. కేసు విచారణ బాధ్యతను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు అప్పగించారు. అనంతరం ప్రతాప్‌గఢ్ వెళ్లి గర్భవతియైన బాధితురాలిని ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. రాజస్థాన్ బిడ్డ చాలా ధైర్యవంతురాలు, ఆమె అవమానకరమైన బాధను గొప్ప తెగువతో భరించింది. ఆమె ఆర్ధిక, సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ఆమెకు రూ.10 లక్షలు ఆర్ధిక సహాయంతో పాటు ఉద్యోగాన్ని కూడా కల్పిస్తున్నామని ప్రకటించారు. ఆమెకు ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం తరపున అందజేస్తామని కూడా తెలిపారు. #WATCH | After meeting the Pratapgarh assault victim, Rajasthan CM Ashok Gehlot says, "In this case, an SIT has been formed. 11 people have been arrested... I spoke to the victim's family and assured them that justice would prevail... I offered her a government job... And we will… pic.twitter.com/rJQ4mFHbXk — ANI (@ANI) September 2, 2023 ఇది కూడా చదవండి: బాలాసోర్ రైలు ప్రమాదానికి అదే కారణం.. చార్జిషీట్లో సీబీఐ -
మూత్రం కలిపిన టీ తాగితే..అతీత శక్తులు?
ఇండోర్: అతీతశక్తులు వస్తాయన్న మూఢనమ్మంతో అత్తమామలు, భర్తను వేధించిన ఓ మహిళపై కేసు నమోదుకు ఇండోర్ జిల్లా కోర్టు ఆదేశించింది. గృహ హింస రక్షణ చట్టం సెక్షన్ 12 కింద కేసులు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే ..ఇండోర్‌కు చెందిన రేఖా నాగ్వంశీ అనే మహిళ మూత్రం కలిపిన టీ తాగమని అత్తమామలతో పాటు భర్తను తరచూ బలవంతం చేసేదట. శక్తి అమ్మవారిని గుడ్డిగా ఆరాధించే ఆమె, భర్త దీపక్‌ను కూడా పూజలు పునస్కారాలు చేయమని బలవంతం చేసేదట. అంతేకాకుండా తనకు పాద సేవ చేయమని నాగవంశీ నిరంతరం వేధించేదట. కోడలు విపరీతధోరణితో మానసికంగా తాము చాలా క్షోభను అనుభవించామని రేఖా నాగ్వంశీ అత్త సూరజ్ బాయ్ ఆరోపిస్తున్నారు. మూత్రం కలిపిన టీ, మురికి వాసన వచ్చే ఆహారం తీసుకోవటం వల్ల తాము అనారోగ్యం పాలయినట్లు చెప్పారు. దీనిపై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె వాపోయారు. పైగా అక్కడి మహిళా అధికారి సుష్మ భాస్కర్ కూడా తమ కోడలికే ఒత్తాసు పలికారని, పైపెచ్చు ఆమె చెప్పినట్టే చేయమని సూచించారని సూరజ్ బాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కోడలికి పోలీసు అధికారిగా పని చేస్తున్నసోదరుడి అండ ఉండటంతో పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోలేదన్నారు. నిత్యం ఆమెతో ఘర్షణ పడి విసిగిపోయిన తాము చివరికి మహిళా శిశు సంక్షేమ శాఖను ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టిన రేఖా నాగ్వంశీపై భర్త, అత్తమామలు చేసిన ఆరోపణలు వాస్తవమేనని, తేలుస్తూ ఓ నివేదిక ఇచ్చారు. ఇండోర్ కోర్టు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ దీనిపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు.