గీతాంజలి ఫిక్స్‌ | Nagarjuna Geethanjali Re Release On November 13 | Sakshi
Sakshi News home page

గీతాంజలి ఫిక్స్‌

Oct 2 2026 12:03 AM | Updated on Oct 2 2026 12:03 AM

Nagarjuna Geethanjali Re Release On November 13

నాగార్జున కెరీర్‌లోని క్లాసిక్‌ లవ్‌స్టోరీ సినిమా ‘గీతాంజలి’ మళ్లీ థియేటర్స్‌లోకి రానుంది. నాగార్జున, గిరిజ హీరో హీరోయిన్లుగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గీతాంజలి’ (1989). ఈ బ్లాక్‌బస్టర్‌ సినిమా తెలుగు, తమిళ భాషల్లో 4కె వెర్షన్‌లో నవంబరు 13న రీ రిలీజ్‌ కానుంది. 

బూర్లె శివ ప్రసాద్‌ నేతృత్వంలోని శ్రీ పద్మిని సినిమాస్‌ ఈ సినిమాను రీ రిలీజ్‌ చేయనుంది. ‘‘గీతాంజలి’ సినిమాను ప్రేమించిన ప్రేక్షకులు, ఈ లేటెస్ట్‌ వెర్షన్‌తో మరోసారి ఆ మధురానుభూతిని థియేటర్స్‌లో ఆస్వాందించవచ్చు’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement