దినేష్ తేజ్, దష్విక .కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తత్వం’. అర్జున్ కోలా దర్శకత్వంలో శీమకుర్తి వంశీకృష్ణ, శ్వేత పసుపులేటి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో దినేజ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ 2000 టైమ్‌లైన్‌తో సాగు తుంది.
నమ్మకానికి, మూఢ నమ్మకానికి మధ్య చిన్న గీత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. సినిమా చివర్లో హీరోకి ఏ తత్వం బోదపడింది? అన్నది కథ. కథలోని ట్విస్ట్‌లను ఊహించలేరు’’ అని చెప్పారు.


