జై జగన్నాథ..

జై జగన్నాథ..


నెల్లూరు(బృందావనం) : హరేరామ..హరేకృష్ణ..కృష్ణకృష్ణ హరేహరే..రామరామ హరేహరే..జై జగన్నాథ నామస్మరణతో సింహపురి వీధులు మార్మోగారుు. ఆనందపారవశ్యులైన భక్తుల నృత్యాలు, కీర్తనలు, భక్తగీతాలు, కోలాటాలు, విద్యుత్ దీపాలంకరణలు, మంగళవారుుద్యాల నడుమ సోమవారం నెల్లూరులో జగన్నాథ రథయూత్ర కనులపండువగా సాగింది. మహిళలు రంగురంగుల రంగవళ్లులు తీర్చిదిద్ది రథోత్సానికి స్వాగతం పలికారు. జగ న్నాథుడి దర్శనంతో పాటు నైవేద్యాలు సమర్పించేందుకు దారిపొడవునా భక్తులు బారులుదీరారు.



బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథంపై కొలువుదీరిన జగన్నాథుడు భక్తులను అనుగ్రహిస్తూ ముందుకు సాగారు. స్వామి వారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. అంతర్జాతీయ శ్రీ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 4వ జగన్నాథ రథయూత్ర నవాబుపేటలోని శివాలయం ప్రాంగణం నుంచి ఆత్మకూరు బస్టాండ్, గాంధీబొమ్మ, ఆర్టీసీ మీదుగా కేవీఆర్ పెట్రోలు బంకు సెంటర్ సమీపంలోని కస్తూరిదేవి విద్యాలయం ప్రాంగణం వరకు సాగింది.



రథయూత్రను ఇస్కాన్ కేంద్ర గవర్నింగ్‌బాడి కమిషనర్ భానుస్వామి మహరాజ్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోరుున అనిల్‌కుమార్‌యూదవ్, మేయర్ అబ్దుల్ అజీజ్, పారిశ్రామికవేత్త, వితరణశీలి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి తదితరులు ప్రారంభించారు. నవాబుపేట శివాలయం వద్ద నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో రథయూత్ర విశిష్టత, జగన్నాథతత్వాన్ని వక్తలు వివరించారు.

 

జగన్నాథుని దర్శనం మంగళదాయకం

జగన్నాథుడి దర్శనం మంగళదాయకమని ఇస్కాన్ కేంద్ర గవర్నింగ్ బాడి కమిషనర్ భానుస్వామి మహరాజ్ అన్నారు. కృష్ణభగవానుడి ఆరాధనతో జీవితం సుసంపన్నమౌతుందన్నారు. ప్రస్తుత ఆధునిక,ఒడిదుడుకుల జీవితంలో భగవంతుడిని నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమన్నారు. భగవంతుని సేవతో జీవితం పునీతమౌతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు.



కురుక్షేత్ర ఇస్కాన్ మందిర నిర్వాహకుడు సాక్షి గోపాల్ మాట్లాడుతూ జగన్నాథతత్వాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న కాంక్షతో 1966లో ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు భక్తివేదాంత ప్రభుపాద అమెరికాలో జగన్నాథ యూత్ర ప్రారంభించారన్నారు. నేడు అది ఎంతో విశిష్టతగా సాగుతోందన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ భగవంతుని ప్రార్థించడమంటే నీతివంతముగా జీవించడమేనన్నారు. ప్రతి ఒక్కరు తోటి వ్యక్తిలో దైవత్వాన్నిచూడాలన్నారు.



మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవగా భావించి ఇస్కాన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. నెల్లూరు ఇస్కాన్ మందిర అధ్యక్షుడు సుఖదేవస్వామీజీ మాట్లాడుతూ జగన్నాథ రథయూత్రకు తోడ్పాటు అందిస్తున్న వదాన్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కసూర్తిదేవి విద్యాలయం ఆవరణలో జరిగిన ముగింపు కార్యక్రమంలో స్వామీజీల సందేశాల తర్వాత జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు 56 వంటకాల నైవేద్యం సమర్పించారు.



మొదట జగన్నాథ రథయూత్ర టీషర్టులను మేయర్ అజీజ్, ఇస్కాన్ మందిర బ్యాగులను వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జగన్నాథుడి లీల వైభవం పుస్తకాన్ని ఎమ్మెల్యే అనిల్, సుఖదేవస్వామి ఆలపించిన శ్రీకృష్ణభక్తి గీతాల సీడీని మాజీ ఎమ్మెల్యే ముంగమూరు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూలమూరి రంగయ్యనాయుడు, ఆనం జయకుమార్‌రెడ్డి, ఇస్కాన్ ప్రతినిధులు వేదాంత చైతన్యదాస్, సత్యగోపినాథ్ దాస్, సహదేవ్‌దాస్, శ్రీవత్సదాస్ తదితరులు పాల్గొన్నారు.

 

జగన్నాథుని సేవలో ఎంపీ మేకపాటి

రథయూత్ర గాంధీబొమ్మ సెంటర్‌లో సాగుతున్న సమయంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలను దర్శించుకుని స్వామీజీల ఆశీస్సులు పొందారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top