ఫేక్‌ అయితేనేం... ఫేమ్‌ అయ్యింది! | Jose Luis Fernnndez sculpture viral social media | Sakshi
Sakshi News home page

ఫేక్‌ అయితేనేం... ఫేమ్‌ అయ్యింది!

Apr 23 2026 4:32 AM | Updated on Apr 23 2026 4:32 AM

Jose Luis Fernnndez sculpture viral social media

వైరల్‌ స్టాట్యూ

సమాజం సవ్యంగా ఉండాలంటే కుటుంబాలు బాగుండాలి. ఆ కుటుంబాల కోసం పిల్లల పెంపకం నుంచి ఇంటిపనుల వరకు మహిళలు ఎంతో శ్రమిస్తారు. తల్లుల కష్టమే కుటుంబ రథానికి ఇంధనం అవుతుంది. అయితే వారి శ్రమ ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతుంటుంది. పైగా... ‘పురుషులు బయటకి వెళ్లి కష్టపడతారు. 

స్త్రీలు ఇల్లు కదలకుండా సుఖంగా ఉంటారు’ అనే ప్రచారం ఒకటి. వారి శ్రమకు వెల కట్టేవారు లేరు. వారి శ్రమ కనిపించని శ్రమ అయింది. తాజా విషయానికి వస్తే.,...‘ఏమీ చేయని స్త్రీ’ అని పేరు పెట్టిన ఒక శిల్పం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లుల కనబడని శ్రమకు గౌరవసూచకంగా రూపొందించిన ఈ శిల్పం స్పెయిన్‌లో ఉందని చెబుతుంటారు.

‘ఇంటికి పరిమితమైన మహిళలు ఏమీ చేయరు’ అనే పురుషాధిక్య భావజాలాన్ని బద్దలు కొట్టే శిల్పం ఇది. జోస్‌ లూయిస్‌ ఫెర్నాండేజ్‌ రూపొందించారని చెబుతున్న ఈ శిల్పంలో... ఒకవైపు పిల్లలను చేతిలో పట్టుకొని, మరోవైపు... చీపురు, వాషింగ్‌ మెషిన్, బకెట్‌లాంటి ఇంటిబరువును వీపున మోస్తున్న స్త్రీ కనిపిస్తుంది. 

ముగ్గురు పిల్లలను, ఇంటి పనులను వీపుపై మోస్తున్న ఈ స్త్రీ శిల్పం సోషల్‌ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ పొందింది. అసలు విషయం ఏమింటే, ఇలాంటి శిల్పం నిజంగా లేదు. పూర్తిగా కల్పితం. అయినప్పటికీ ఈ కల్పిత శిల్పం విపరీతంగా వైరల్‌ అయింది. లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకొని ‘వైరల్‌ స్టాచ్యూ’ గా  పేరు తెచ్చుకుంది.
 
‘ఏమీ చేయని స్త్రీ’ అని పేరు పెట్టిన ఒక శిల్పం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లుల కనబడని శ్రమకు గౌరవసూచకంగా రూపొందించిన ఈ శిల్పం స్పెయిన్‌లో ఉందట! ‘ఇంటికి పరిమితమైన మహిళలు ఏమీ చేయరు’ అనే పురుషాధిక్య భావజాలాన్నిబద్దలు కొట్టే శిల్పం ఇది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement