కలసికట్టుగా పోరాడాలి.. | - | Sakshi
Sakshi News home page

కలసికట్టుగా పోరాడాలి..

May 15 2026 12:07 PM | Updated on May 15 2026 12:07 PM

కలసికట్టుగా పోరాడాలి..

జిల్లా అభివృద్ధి కోసం ప్రజలంతా కలసికట్టుగా ప్రజాప్రతి నిధులు, నాయకులపై ఒత్తిడి తీసుకురావాలి. సీఎం ప్రకటించిన వాటిలో ఒక్క నిజామాబాద్‌ అభివృద్ధి ప్రాజెక్టులు తప్ప ఇతర అన్ని జిల్లాలవి ఉన్నాయి. నిజామాబాద్‌ రింగురోడ్డు హామీ నిలబెట్టుకోకపోగా, ప్రకటించిన టెంపుల్‌ కారిడర్లు, టూరిజం కారిడర్లలో సైతం జిల్లా ప్రస్తావనే లేదు. ఇది శోచనీయం. గతంలో కేసీఆర్‌, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఇచ్చిన రింగురోడ్డు హామీ అలాగే వదిలేశారు. ఇక 2009లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రతిపాదించిన జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు విషయాన్నీ తర్వాత ప్రభుత్వాలు వదిలేశాయి. ఇక కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌ నగరానికి 50 బస్సులను కేటాయించి, సిటీ బస్సు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో 10 ఎకరాల స్థలం చూపించమంటే దాన్నీ పెండింగ్‌లో పెట్టడం సరికాదు. ఖమ్మం, కరీంనగర్‌ కంటే పెద్దదైన నిజామాబాద్‌ నగరానికి రింగురోడ్డు ఇవ్వకపోవడం సరికాదు. జనాభా, ఓటర్లు, విస్తీర్ణం పరంగా పెద్దదైన నిజామాబాద్‌ను వదిలేసి ఆ నగరాలకు మాత్రం రింగురోడ్డులు ఇస్తే జిల్లా నాయకులు మాత్రం స్పందించకపోవడం శోచనీయం.

– రేకులపల్లి చంద్రశేఖర్‌రెడ్డి,

అధ్యక్షుడు, జిల్లా అభివృద్ధి సంస్థ

Advertisement
 
Advertisement
Advertisement