పెర్కిట్(ఆర్మూర్): కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్‌లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అకాల వర్షం కురిస్తే ధాన్యం తడిసి పోయే అవకాశం ఉంటుందని, తరలింపును వేగవంతం చేయాలని సూచించారు. టార్పాలిన్‌లను అందుబాటులో ఉంచాల న్నారు. అలాగే రైస్ మిల్లుల్లో వెంటవెంటనే ధాన్యం అన్‌లోడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పౌరసర ఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సకాలంలో బిల్లుల చెల్లింపు పూర్తయ్యేలా ట్యాబ్‌లో ఎంట్రీని వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఆర్డీవో సాయన్న, డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం ప్రవీణ్, డీసీవో ఎన్ శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.


