కూరగాయలతో కాలభైరవుడికి అలంకారం | - | Sakshi
Sakshi News home page

కూరగాయలతో కాలభైరవుడికి అలంకారం

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

రామారెడ్డి (ఎల్లారెడ్డి): ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి(రామారెడ్డి) శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో వై శాఖ మాసం మూడో మంగళవారం పురస్కరించుకు ని పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని 108 రకాల కూరగాయలతో అత్యంత రమణీయంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారికి జలాభిషేకాలు, సింధూర పూజలు నిర్వహించారు. మధ్యా హ్నం భజన కార్యక్రమాల అనంతరం, కూరగాయలతో అలంకరించిన స్వామివారికి ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement