అలుపెరగని ప్రేమ అమ్మ | - | Sakshi
Sakshi News home page

అలుపెరగని ప్రేమ అమ్మ

May 10 2026 8:22 AM | Updated on May 10 2026 8:22 AM

‘ఉదయం 5 గంటలకు లేచి వంట, ఇంటిపని ముగించుకొని స్కూల్‌కు వెళ్తాను. సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ పిల్లల హోంవర్క్‌, వంట. అలసట ఉన్నా పిల్లల నవ్వు చూస్తే అదంతా మాయమవుతుంది’ అంటున్నారు ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న లక్ష్మి. ఇది ఒక్క లక్ష్మి కథే కాదు.. లక్షలాది మంది తల్లుల త్యాగానికి ప్రతిరూపం.

ఆర్మూర్‌/మోర్తాడ్‌: అలుపెరగని ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ. తన కడుపు మాడ్చుకొని బిడ్డల కడుపు నింపే త్యాగమూర్తి ఆమె. నడక నేర్పి, నాగరికత నేర్పి, జీవితాన్ని నడిపించే దారి దీపం. ఆధునిక యుగంలో ఉద్యోగం, వ్యాపారం అంటూ తల్లి కూడా బయటికి వచ్చింది. ఇంటిని చక్కదిద్దుతూనే, ఆఫీసులో రాణిస్తూ, పిల్లల భవితకు బంగారు బాటలు వేస్తోంది. తెల్లవారి లేచింది మొదలు అర్ధరాత్రి వరకు కుటుంబం కోసం యంత్రంలా పనిచేసే అమ్మ విశ్రాంతి అనే పదాన్ని మరిచింది! కష్టాలను ఓర్చుకుంటూ కన్నీళ్లను దిగమింగుకుంటూ తల్లిగా తన పిల్లలను లాలిస్తుంది. ఉద్యోగ, వ్యాపార బాధ్యతలలో తలమునకలైనా తన పిల్లలకు ఎలాంటి లోటు రానీయకుండా కాపాడుకుంటుంది. అమ్మ రుణం తీర్చుకోవడానికి ఒక్క రోజు సరిపోదు. ప్రతి రోజూ మదర్స్‌ డేనే. ఆమెను ప్రేమగా చూసుకోవడం, ఆమె మాట వినడం, వృద్ధాప్యంలో తోడు గా నిలవడమే మనం ఆమెకు ఇచ్చే నిజమైన బ హుమతి. అమ్మ చూపే అనురాగాన్ని, ఆమె త్యా గాన్ని స్మరించుకుంటూ నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ‘మదర్స్‌ డే’ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..

Advertisement
 
Advertisement
Advertisement