● పంట సాగు అంచనా నివేదిక
విడుదల చేసిన వ్యవసాయ శాఖ
● జిల్లా వ్యాప్తంగా 5.30 లక్షల ఎకరాల్లో సాగవనున్న పంటలు
డొంకేశ్వర్(ఆర్మూర్): 2026–వానకాలం (ఖరీ ఫ్) సీజన్‌కు సంబంధించిన పంట ప్రణాళిక ఖా రైంది. జిల్లా వ్యాప్తంగా 5.30లక్షల ఎకరాలకు పైగా వివిధ పంటలు సాగవుతాయని వ్యవసా య శాఖ అంచనా వేసింది. అత్యధికంగా 4.38 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వరి సాగయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే, గతేడాది ఖరీఫ్‌తో పోలిస్తే ఈసారి కొంతమేర సాగు విస్తీర్ణం పెరగనుంది. తొల కరి చినుకులు కురవగానే రైతులు జూన్ మొదటి, రెండో వారం నుంచి సాగు పనుల ను ప్రారంభించనున్నారు. వరి తర్వాత మొక్కజొన్న, సోయాబీన్, పసుపు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపే అవకాశముంది.
ఎరువులు, విత్తనాలు!
ఖరీఫ్ పంటలకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులకు కూడా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. వరికి 1.10 లక్షల క్వింటాళ్లు, మొక్కజొన్నకు 4,400 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా వేసింది. అలాగే సోయాబీన్‌కు 10,268 క్వింటాళ్లు, కందికి 40 క్వింటాళ్లు, పత్తికి 8 క్వింటాళ్లు అవసరం అవుతాయని ప్రతిపాదనలు తయారు చేసింది.
విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి
డిమాండ్‌ను బట్టి ఖరీఫ్ పంటల అంచనా ప్రతిపాదనలు రూపొందించాం. విత్తనాలు, ఎరువులలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. పంటలు సాగు చేసేముందు రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని. సలహాలు, సూచనల కోసం స్థానికంగా ఏఈవోలను సంప్రదించాలి. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి
ఎరువుల అంచనా
(మెట్రిక్ టన్నులు)


