● ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ పై కేసు నమోదు
● మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి,
కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశం
నిజామాబాద్ అర్బన్: వరి ధాన్యం కొనుగోలు ప్ర క్రియకు ఆటంకాలు కలిగేలా వ్యవహరిస్తున్న వారి ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ధాన్యం రవాణాకు లారీలు సమ కూర్చని ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం రైస్ మిల్ల ర్లు, ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లతో ప్రభుత్వ సలహాదారు, కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పలు చోట్ల రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.
బాల్కొండ సెక్టార్ లో కొనుగోలు కేంద్రాలకు వాహనాలను సమకూర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్ తీరును తీవ్రంగా పరిగణిస్తూ, సదరు కాంట్రాక్టర్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ కు లిఖిత పూర్వకంగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశా రు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా రైస్ మిల్లర్లు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. కడ్తా, తరుగు పేరుతో ఎవరైనా రైతులను నష్టపరిచే చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. అవసరమైతే నిజామాబాద్ మా ర్కెట్ యార్డులో పని చేస్తున్న హమాలీ కార్మికుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
రైతులు శుభ్రపరచిన ధాన్యాన్ని తేవాలి
కొనుగోలు కేంద్రాలకు రైతులు శుభ్రపరచిన ధా న్యాన్ని తరలించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కోరారు. ఈసారి రబీలో ఆశించిన దానికంటే ఎక్కువగా మొక్కజొన్న, వరి ధాన్యం దిగుబడులు వచ్చాయన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేస్తున్నామన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవ హరిస్తున్నారని సుదర్శన్ రెడ్డి దుయ్యబట్టారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మ న్ ముప్ప గంగారెడ్డి, డీఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీసీవో శ్రీనివాస్, వ్యవసా య అధికారి వీరస్వామి, అధికారులు పాల్గొన్నారు.


