రైతులు ఆందోళన చెందొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులు ఆందోళన చెందొద్దు

May 16 2026 3:01 AM | Updated on May 16 2026 3:01 AM

సాక్షి ప్రతినిధి నిజామాబాద్‌: రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందొద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు అవసరమైన గోదాముల పరిశీలనలో భాగంగా శుక్రవారం వేల్పూర్‌లోని సొసైటీ కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న గోదామును సుదర్శన్‌రెడ్డి శుక్రవా రం పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లా డి వారి సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఆయనవెంట రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ కుంట రమేశ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కే నగేశ్‌రెడ్డి, అమీనాపూర్‌ సర్పంచ్‌ నవీన్‌, వెంకటాపూర్‌ సర్పంచ్‌ సుజాత, లక్కోరా సర్పంచ్‌ అపర్ణ రాజు ఉన్నారు.

రైతులను రెచ్చగొట్టే రాజకీయాలు..

పెర్కిట్‌: చివరి గింజ వరకూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆలూర్‌ మండల కేంద్రంతోపాటు మిర్దాపల్లిలోని కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. కడ్తా, తరుగు అంటూ ఇబ్బందులకు గురిచేస్తే కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించా రు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఉద్రిక్తతలు సృష్టించి రై తులను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement