రెవెన్యూ ఉద్యోగుల స్వీయగణన నమోదు | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ ఉద్యోగుల స్వీయగణన నమోదు

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

అభినందించిన కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నిజామాబాద్‌ అర్బన్‌: జనాభా గణన–2027లో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ ఉద్యోగులు స్వీయ నమోదు చేసుకున్నారు. ఉద్యోగులు ఎవరికి వారు తమ కుటుంబ సభ్యుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి వారిని అభినందించారు. మిగతా శాఖల ఉద్యోగులు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకుని స్వీయ గణన చేసుకోవాలని సూచించారు. ఈసారి జనాభా గణన–2027 డిజిటల్‌ విధానంలో నిర్వహించబడుతోందన్నారు. ఈ నెల 10 వరకు పోర్టల్‌ ద్వారా స్వీయ నమోదు చేసుకోవచ్చని సూచించారు. స్మార్ట్‌ ఫోన్‌, కంప్యూటర్‌ ద్వారా https://se.census.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్వీయ గణన చేసుకోవచ్చన్నారు. నమోదు అనంతరం ప్రతి వ్యక్తికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూనిక్‌ ఐఈ) వస్తుందని, దానిని భద్రపరచి ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు అందజేయాలని సూచించారు. అన్ని శాఖల ఉద్యోగులు, జిల్లా ప్రజలందరూ మే 10లోపు స్వీయ గణన పూర్తి చేసి జిల్లా అభివద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్‌ పిలు పునిచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రావు, కలెక్టరేట్‌ ఏవో ప్రశాంత్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement