హామీ
మరిచారా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే నిజామాబాద్‌కు రింగురోడ్డు నిర్మిస్తామని గత ఎన్నికల సభలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి దాన్ని మరిచిపోయారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పాలకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ ఇచ్చిన హామీని పట్టించుకోకపోవడమేమిటని నిట్టూర్పులు వస్తున్నాయి.
ముఖ్యమంత్రి తాజాగా రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, కరీంగనర్ నగరాల చుట్టూ రింగురోడ్లు నిర్మించేందుకు నిర్ణయించి, నిజామాబాద్ రింగురోడ్డు విషయాన్ని పట్టించుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రతిపాదించిన జక్రాన్‌పల్లి విమానాశ్రయాన్ని అటకెక్కించారని, మరోవైపు డ్రైపోర్టు అంశాన్ని పక్కకు పెట్టారని, హైదరాబాద్–నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడర్ విషయాన్ని మరిచారని జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఽడాక్టర్ భూపతిరెడ్డి నగరం చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్ కోసం రూ.2వేల కోట్లతో ప్రతిపాదనలు, గుండారం వద్ద 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ జోన్ కోసం ప్రతిపాదనలు పంపారు. వరంగల్ తర్వాత పెద్ద నగరంగా ఉన్న నిజామాబాద్‌పై ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇందూరుకు రింగ్ రోడ్డు నిర్మిస్తామని సీఎం ఇచ్చిన హామీని నగర ప్రజలు గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర నగరాలకు రింగ్ రోడ్ ప్రకటించి జిల్లాకు మొండిచేయి చూపడంపై అసహనం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సీఎం ఇచ్చిన హామీలు మరోసారి తెరపైకి వచ్చాయి.
ఇందూరుకు రింగ్ రోడ్ ఎప్పుడు?
గత మున్సిపల్ ఎన్నికల్లో సీఎం ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్న ప్రజలు
తక్షణమే మంజూరు చేయాలని
డిమాండ్లు
జక్రాన్‌పల్లి విమానాశ్రయం, డ్రైపోర్టు, హైదరాబాద్–నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడర్లు సైతం అటకెక్కించడంపై జనాల్లో అసహనం


