● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● ‘కళావైభవం– కలర్స్ ఆఫ్ చైల్డ్ హుడ్’ నిర్వహణ
నిజామాబాద్ రూరల్: చిన్నారులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ, వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు బాల భవన్ ఆధ్వర్యంలో వేసవిలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు ఉపయుక్తంగా నిలుస్తున్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంసించారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నగరంలోని బాల భవన్‌లో శనివారం ‘కళా వైభవం – కలర్స్ ఆఫ్ చైల్డ్ హుడ్‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాల భవన్‌లో శిక్షణ పొందుతున్న బాలబాలికలు తమ సృజనను చాటుతూ అందంగా ఆకట్టుకునే రీతిలో తయారు చేసిన కళాకృతులు, గీసిన కళాకృతులను ఆసక్తితో తిలకించారు. పేరిణి, కోలాటం నృత్యాలతో అలరింపజేసిన చిన్నారులను, వెంట్రిలాక్విజంతో ఆకట్టుకున్న జాదూ యుగంధర్ రంగనాథ్‌ను కలెక్టర్ ప్రశంసించారు. చిన్నారుల మధ్యకు వెళ్లి న కలెక్టర్ ఆయా అంశాలపై ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. చిన్నారులకు చాక్లెట్లు పంచుతూ, బహుమతులు అందజేశారు. చిన్నారులు వేసవి సెలవుల ను సద్వినియో గం చేసుకునే లా తల్లిదండ్రు లు తమ పిల్లలను బాల భవన్‌లో చేర్పించా లని కలెక్టర్ సూచించారు. వేస వి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అ న్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. మే యర్ ఉమారాణి మాట్లాడుతూ నేటి చదువులు ఎంతో ఒత్తిడితో కూ డుకుని ఉంటున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో బాల భవన్ అందిస్తున్న వేసవి శిక్షణ కార్యక్రమాలు చిన్నారులకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తూ, వారిలో సృజనాత్మకతను, నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, బాలభవన్ సూపరింటెండెంట్ ఉమాబాల,మాజీ పర్యవేక్షకుడు ప్రభాకర్, రాఘవేందర్, వెంకటలక్ష్మి, పుష్పలత, శ్వేత,సోనాలి,రిచా,మాధవి,గణేశ్,రాంచందర్, పవన్, నవీన్, మాధవి తదితరులు పాల్గొన్నారు.
పేరిణి నృత్యం ప్రదర్శిస్తున్న విద్యార్థినులు


