నగరంలో లీకేజీ తిప్పలు | - | Sakshi
Sakshi News home page

నగరంలో లీకేజీ తిప్పలు

May 9 2026 9:49 AM | Updated on May 9 2026 9:49 AM

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

వేర్వేరు చోట్ల చోరీలు

ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డి, దోమకొండ, నిజామాబాద్‌లో దుండగులు చోరీలకు పాల్పడి నగదు, వెండి ఎత్తుకెళ్లారు.

శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026

– 8లో u

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ నగరంలో వేసవి నీటి కష్టాలకు చెక్‌ పెట్టేందుకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించింది. అయి నప్పటికీ పలు ప్రాంతాల ప్రజలకు తిప్పలు తప్ప డం లేదు. నగరం వేగంగా విస్తరిస్తున్నా నల్లా కనెక్ష న్‌ల సంఖ్య మాత్రం అంతంగానే ఉంది. శివా రు కాలనీల్లో ప్రజలు బోర్లు తవ్వించి ము న్సిపాలిటీ నల్లాలపై ఆధారపడటం లేదు. అ యితే ఉన్న కనెక్షన్‌లకూ పలు ప్రాంతాల కు నీటి సరఫరాలో ఇబ్బందు లు తప్ప డం లేదు. రోజూ ఏదో ఒక ప్రాంతంలో పైన్‌లైన్‌లకు లీకేజీలు ఏర్పడు తూనే ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల కు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజూ ఎడపల్లి మండలం అలీసాగర్‌, మంచిప్ప ఫిల్టర్‌బెడ్‌ ద్వారా సుమారు 80 ఎంఎల్‌డీ (80 లక్షల లీటర్లు) నీరు సరఫరా అవుతోంది. పెద్దబజార్‌, తిలక్‌గార్డెన్‌, నామ్‌దేవ్‌వాడ, గంగస్థాన్‌, వినాయక్‌నగర్‌, కంఠేశ్వర్‌, సుభాష్‌నగర్‌, గోల్‌ హను మాన్‌, రేడియోస్టేషన్‌, 33 క్వార్టర్స్‌, కోటగల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద నీటి ట్యాంకులు ఉన్నాయి.

లీకేజీ ఏరియాలు..

ముఖ్యంగా గాయత్రినగర్‌, హైమద్‌పురా కాలనీ, ఎల్లమ్మగుట్ట, పెద్దబజార్‌, గోల్‌హనుమాన్‌, గాజుల్‌పేట్‌, అర్సపల్లి తదితర ప్రాంతాల్లో తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. మున్సిపల్‌ అధికారు లు పైప్‌లైన్‌ లీకేజీలకు మరమ్మతులు చేయిస్తూనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరాచేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో తాత్కాలికంగా నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలకు సైతం ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు.

నిరంతర పర్యవేక్షణ

నగరంలో నీటి ఎద్దడి నివారణకు వేసవిలో ప్రత్యేకంగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాం. లీకేజీలు ఏర్పడకుండా, నీరు వృథా పోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాం. లీకేజీలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తున్నాం. లీకేజీలు ఏర్పడిన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. – దిలీప్‌కుమార్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, నిజామాబాద్‌

వేసవి యాక్షన్‌ ప్లాన్‌ ఉన్నా..

తప్పని పాట్లు

లీకేజీలు ఉన్న ప్రాంతాలకు

ట్యాంకర్ల ద్వారా సప్లయ్‌

నిజామాబాద్‌ నగరంలో ప్రతిరోజూ 80లక్షల లీటర్లు సరఫరా

Advertisement
 
Advertisement
Advertisement