బంగారు దుకాణాదారులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

బంగారు దుకాణాదారులు అప్రమత్తంగా ఉండాలి

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

బంగారు దుకాణాదారులు అప్రమత్తంగా ఉండాలి డిగ్రీ పరీక్షలు ప్రశాంతం ‘రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి’

ఏసీపీ శ్రీనివాస్‌

బోధన్‌టౌన్‌(బోధన్‌): పట్టణ పరిఽధిలోని బంగా రు దుకాణాల యజమానులు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ శ్రీనివాస్‌ సూచించారు. పట్ట ణ పోలీస్‌ స్టేషన్‌లో జ్యువెలరీ దుకాణాల యజమానులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌లోని జ్యువెలరీ దుకాణంలో జరిగిన చోరీ తీరును వివరించారు. ఎవరైన కొత్త వ్యక్తులు వచ్చినా, అనుమానితులుగా అ నిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇ వ్వాలన్నారు. దుకాణాల లోపల, బయట సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, అలారం సిస్టమ్‌తోపాటు రాత్రివేళలో వాచ్‌మన్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో పట్టణ సీఐ వెంకటనారాయణ, ఎస్సై భాస్కర్‌ చారీ పాల్గొన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడ మిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జి ల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 29 పరీక్షా కేంద్రా ల్లో 2,286 మంది విద్యార్థులకుగాను 2,154 మంది విద్యార్థులు హాజరు కాగా 132 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఉదయం నిర్వహించి న ఆరో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షకు 2,143 మంది విద్యార్థులకు గాను 2,031 మంది హా జరు కాగా 112 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే మ ధ్యాహ్నం నిర్వహించిన మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 143 మంది విద్యార్థులకుగాను 123 మంది హాజరు కాగా 20 మంది గైర్హాజరైనట్లు చంద్రశేఖర్‌ వివరించారు.

దోమకొండ: ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ విక్టర్‌ సూచించారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు లింగుపల్లి గ్రామాల్లో కొనుగొలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.నిర్వాహకులకు సూచనలు ఇచ్చా రు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదు పాయాలు కల్పించాలని, సేకరించిన వడ్లను వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించి ట్యాబ్‌ ఎంట్రీ పూర్తిచేయలని సూచించారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్‌, ఆర్‌ఐ కిష్టయ్య, సొసైటీ కార్యదర్శి బాల్‌రెడ్డి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement