● ఎండోమెంట్ ఆస్తులను పరిరక్షించాలి
● ఉమ్మడి జిల్లా ఈవోల సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ విజయరామారావు
నిజామాబాద్ రూరల్: దేవాలయాల సిబ్బంది సమస్యలను పరిష్కరించడంతోపాటు భక్తుల నుంచి దేవాదాయశాఖకు సంబంధించిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించేందుకు ప్రతి సోమవారం ‘ధర్మవాణి’ నిర్వహిస్తామని దేవాదాయ ధర్మాదాయశాఖ ఉప సంచాలకులు విజయరామారావు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని ఎండోమెంట్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహణ అధికారులతో బుధవారం ప్రత్యేక స మావేశం నిర్వహించారు. దేవాలయాల భూము లు, ఆస్తుల పరిరక్షణ, ఆదాయ వృద్ధి, ఆలయాల నిర్వాహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా విజయరామారావు మాట్లాడుతూ.. ఈనెల 18వ తేదీ నుంచి ధర్మవాణి ప్రారంభమవుతుందన్నారు. ఆలయాల భూముల సర్వే పూర్తికాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కమిషనర్ ఉత్తర్వుల మేరకు సర్వే, ల్యాండ్ రికార్డుల వారికి లేఖ పంపించామన్నారు.
భూముల సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఆలయాల్లో బంగారం, వెండి ఆభరణాల వెరిఫికేష న్ చేపట్టాలని, సంబంధిత అధికారులతో సమన్వ యం చేసుకొని ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాల ఆవరణలో తడకలు, పందిళ్లు వేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆలయాల ఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు.


