ఇంటర్‌ అడ్మిషన్లు ఇప్పుడే వద్దు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ అడ్మిషన్లు ఇప్పుడే వద్దు

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

కోర్టుకు ఎన్నికల సామగ్రి

ఖలీల్‌వాడి: ఇంటర్మీ డియట్‌ బోర్డు ఇటీవ ల ప్రకటించిన అడ్మిషన్‌ షెడ్యూలు రద్దు చేసినందున ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌, రెసిడెన్షియల్‌, ఇతర గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేయాలని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్‌ ప్రకటించారు. కొత్త షెడ్యూలు వచ్చిన తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించా లన్నారు. ఇంటర్‌ కళాశాలల్లో ఇప్పుడే చేరరాదని, ప్రైవేట్‌ కళాశాలల్లో ఎవరూ ఫీజులు చెల్లించవద్దని స్పష్టం చేశారు. అడ్మిషన్లను ని ర్వహించినట్టు తమ దృష్టికి వస్తే కళాశాల లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఇంటర్‌ రెండో సంవత్సరం తరగతులు నిర్వహించటానికి వీలులేదన్నారు.

రోడ్డు ప్రమాదంలో

ఆరేళ్ల బాలిక మృతి

రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు

నిజామాబాద్‌ రూరల్‌: రోడ్డు దాటుతున్న ఆరేళ్ల బాలికను అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చక్రధర్‌నగర్‌ తండా సమీపంలో బు ధవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో బా లిక మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ తెలిపారు. బాట్‌లోత్‌ పరమేశ్వర్‌ కుమార్తె కీర్తన(6) కిరాణా షాప్‌కి వెళ్లి రోడు దాటుతుండగా మేఘన డెంటల్‌ కళాశాల విద్యార్థి డ్రైవ్‌ చేస్తున్న కారు అతివేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన బాలికను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

నేడు, రేపు దోస్త్‌ ప్రత్యేక కేటగిరి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

తెయూ(డిచ్‌పల్లి): దోస్త్‌ – యూజీ కోర్సులలో స్పెషల్‌ కేటగిరి కింద అడ్మిషన్‌ పొందిన విద్యార్థులు పీహెచ్‌సీ/ సీఏపీ ఈ నెల 7న, ఎన్‌సీసీ/స్పోర్ట్స్‌, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ విద్యార్థులు ఈ నెల 8న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేయించుకోవాలని తెయూ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ వాసం చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెయూ పరిపాలనా భవనంలోని అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సర్టిఫికెషన్‌ వెరిఫికేషన్‌ జరుగుతుందన్నారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని 38 వార్డుతో పాటు 36, 40 వార్డుల బ్యాలెట్‌ బాక్స్‌లు, వోటర్‌ లిస్టులు, వోట్‌ కౌంటర్‌ ఫైల్స్‌ ఇతర సామగ్రిని మున్సిపల్‌ అధికారులు కోర్టుకు చేర్చారు. మున్సిపల్‌ ఎ న్నికలలో అవకతవకలు జరిగాయంటూ 38వ వార్డులో ఓటమి పాలైన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గ్రామీణ ఓటర్లు, ఇతర వార్డుల ఓట ర్లు 38వ వార్డులో ఓటేయడంతో తాను ఓడి పోవాల్సి వచ్చిందని ఆ అభ్యర్థి ఆవేదన వ్య క్తం చేశారు. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేర కు మున్సిపల్‌ సిబ్బంది బ్యాలెట్‌ బాక్స్‌లు, వోటర్‌ లిస్టులు, వోట్‌ కౌంటర్‌ ఫైల్స్‌ ఇతర సామగ్రిని కోర్టుకు అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement