కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఉచిత వేసవి క్రికెట్ కోచింగ్ క్యాంప్ బుధవారం ప్రారంభమైంది. కౌన్సిలర్ అర్కల ప్రభాకర్ యాదవ్, జిల్లా క్రీడా అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ ఎంతో ఖర్చుతో కూడుకున్న క్రీడ అని, గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికే హెచ్‌సీఏ ఉచిత శిక్షణను అందిస్తోందని తెలిపారు. అండర్–15, అండర్–19, ఓపెన్ కేటగిరీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జిల్లా, రాష్ట్రస్థాయి సెలక్షన్లలో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. క్రీడలు యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి, మానసిక ధైర్యా న్ని, ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయని తెలిపారు. కామారెడ్డి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోజాం అలీ ఖాన్, కోచ్‌లు రామకృష్ణ, రియాజ్, క్రీడాకారులు పాల్గొన్నారు.
నేను గీసిన చిత్రం
● చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే
ఆ వంకర టింకరవి ఏమి కాయలని
అడిగిందట!
(కొద్దిగా సంపద రాగానే తన గతాన్ని,
మూలాలను మరిచిపోయి, అన్నీ తెలిసినా
ఏమీ తెలియనట్లు నటించే వారి అహంకారాన్ని
ఈ సామెత ఎత్తి చూపుతుంది.)
● ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు!
(ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం ఎంత కష్టమో అనుభవిస్తే తెలుస్తుంది.)
మాలోత్ పల్లవి,
6వ తరగతి
గ్రామం : తిమ్మారెడ్డి తండా,
మం : ఎల్లారెడ్డి,
జిల్లా : కామారెడ్డి.


