రీజియన్‌ పరిధిలో 82 ఓపీఆర్‌ఎస్‌ సర్వీసులు | - | Sakshi
Sakshi News home page

రీజియన్‌ పరిధిలో 82 ఓపీఆర్‌ఎస్‌ సర్వీసులు

May 13 2026 1:44 AM | Updated on May 13 2026 1:44 AM

నిజామాబాద్‌ రూరల్‌: రీజియన్‌ పరిధిలోని ఆయా డిపోల నుంచి 82 ఓపీఆరీఎస్‌(ఆన్‌లైన్‌ ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టం) ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్‌ఎసం జ్యోత్స్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఆయా డిపోల నుంచి రాష్ట్రంలోని జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఎయిర్‌పోర్టు(హైదరాబాద్‌), తిరుపతి, విజయవాడ, భద్రాచ లం తదితర ప్రాంతాలకు రాజధాని, సూ పర్‌లగ్జరీ, ఈ – సూపర్‌ లగ్జరీ, లహరి ఏసీ, లహరి నాన్‌ ఏసీ వంటి సేవలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ప్ర యాణికులు ముందస్తుగా టికెట్‌ బుకింగ్‌ కోసం ఆర్టీసీ వెబ్‌సైట్‌ www.tgsrtcbus. in, మీ టికెట్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు.

డిప్యూటీ సీఎంను

కలిసిన డీఎఫ్‌వో

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లా అటవీశాఖ అధి కారి (డీఎఫ్‌వో) సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌ ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్కను మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్‌ జిల్లాలో అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.

ప్రభుత్వ విత్తనాలనే వినియోగించాలి

సిరికొండ: తెలంగాణ సీడ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాణ్యమైన రాయితీ విత్తనాలనే వినియోగించాలని తెలంగాణ స్టేట్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సుంకెట అన్వేష్‌రెడ్డి రైతులకు సూచించారు. సీడ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించే విత్తనాలపై మండలంలోని కొండూర్‌లో రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. సంస్థ ద్వారా బీపీటీ 5204, కేఎన్‌ఎం 1638, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకం వరి విత్తనాలు అందుబాటులో ఉన్నా యని అన్వేష్‌రెడ్డి తెలిపారు. ప్రైవేట్‌ సంస్థల విత్తనాల వాడకాన్ని తగ్గించాలని రైతులకు సూచించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌ మాట్లాడుతూ.. రైతులు ఒకే రకమైన పంటలను సాగు చేయకుండా పంట మార్పి విధానాన్ని పాటిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఆయిల్‌ పామ్‌, పప్పు దినుసుల సాగు చేపడితే లాభాలు ఉంటాయన్నారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ చెల్లెం గంగాధర్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బా కారం రవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎర్ర న్న, టీఎస్‌ సీడ్స్‌ డీఎం రఘు, సర్పంచ్‌ నర్మల లతాభాస్కర్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి నర్సయ్య, రైతులు పాల్గొన్నారు.

పశువుల అక్రమ

రవాణాపై ప్రత్యేక నిఘా

ఇందల్వాయి: పశువులు అక్రమ రవాణా కాకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన అంతర్‌జిల్లా చెక్‌పోస్టును ఆయన మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. పశువులను తరలించే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అనుమానాస్పద వాహనాలను తప్పకుండా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. తనీఖీల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పశువుల అక్రమ రవాణా సమాచారం తెలిసే పోలీసులకు అందించాలని ప్రజలకు సూచించారు. ఆయనవెంట డిచ్‌పల్లి సీఐ వినోద్‌, ఇందల్వాయి ఎస్సై సందీప్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement