● కోర్ కమిటీ సమావేశంలో ఎంపీ అర్వింద్
● నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ తీరుపై అసహనం?
సుభాష్‌నగర్: ‘ప్రజా సమస్యలపై ప్రభుత్వ తీరు ను నియోజకవర్గ నాయకులు ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. పలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమా లు మచ్చుకు కూడా నిర్వహించడం లేదు. ప్రజల కోసం పని చేసినప్పుడే వారి ఆదరణ దక్కుతుంది. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు ఆశించిన మేరకు జరగడం లేదు’ అని ఎంపీ అర్వింద్ ధర్మపురి కోర్ కమిటీ సమావేశంలో అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆదివారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పా ర్టీ కార్యక్రమాల నిర్వహణపై అర్వింద్ పలు సూచనలు చేసినట్లు సమాచారం. ప్రజల ఆదరణ పొందినవారే వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా ఎంపికయ్యే అవకాశం ఉంటుందని చెప్పినట్లు తెలిసింది.
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, కోర్ కమిటీ సభ్యులు, ఆయా నియోజకవర్గాల నాయకులు వడ్డి మోహన్‌రెడ్డి, ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి, కంచెట్టి గంగాధర్ పాల్గొన్నారు.


