పరవశింపజేసే అందాలు.. | - | Sakshi
Sakshi News home page

పరవశింపజేసే అందాలు..

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ తీరం ప్రకృతి అందాలతో అలరిస్తోంది. సాయంకాలానికి ముందు నీరు, పచ్చికబయళ్లు, నిలువెత్తున నిలిచిన తాటి చెట్లతో అలరించిన ఆ ప్రాంతం.. సూర్యాస్తమయ సమయానికి ఇలా సిందూర వర్ణంలోకి మారింది. అస్తమిస్తున్న భానుడి కిరణాలు నిశ్చలమైన నీటిలోపడగా ఆ ప్రాంతం బంగారు వర్ణంతో మెరిసిపోయింది. ఈ సుందరమైన దృశ్యాలను డొంకేశ్వర్‌ మండలం పాత జీజీ నడ్కుడలో ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ వద్ద ‘సాక్షి’ కెమెరాలో బంధించింది.

– డొంకేశ్వర్‌(ఆర్మూర్‌)

Advertisement
 
Advertisement
Advertisement