హామీల అమలుపై ఎప్పుడైనా చర్చకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలుపై ఎప్పుడైనా చర్చకు సిద్ధం

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

● రాష్ట్ర కో ఆపరేటివ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి

వేల్పూర్‌: ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ఎప్పుడైనా, ఎలాంటి చర్చకై నా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వే ల్పూర్‌ మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యా లయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్‌ హామీల అమలుపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు విసిరిన సవాళ్లను తాము స్వీకరిస్తున్నామని, చర్చించడానికి టైమ్‌ ఫిక్స్‌ చే యాలని సూచించారు. ప్రశాంత్‌రెడ్డి విసిరిన సవాళ్లకు బదులివ్వడానికి పీసీసీ అధ్యక్షుడి వరకు ఎందుకని, తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచి త కరెంటు, రైతులకు రూ.21 కోట్ల రుణమాఫీ, ఖరీఫ్‌లో గత రెండు సీజన్ల వారీగా బోనస్‌ ఇస్తున్న మా ట అవాస్తవమా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు నిబ ద్ధత ఉంటే కేసీఆర్‌ ఇచ్చిన హామీలలో పదేళ్లలో డ బుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని, అప్పుడే రాజకీయ సన్యాసం తీసుకోవాలని పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవ్వలేదని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ హామీలు అమలు చేయకపోవడంతోనే ప్రజలు పక్కన పెట్టారని అన్నారు. సమావేశంలో వేల్పూర్‌ ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ గడ్డం నర్సారెడ్డి, నాయకులు పన్నాల రాజేశ్వర్‌, రాజేందర్‌, గౌరాయి నరేందర్‌, దామోదర్‌గౌడ్‌, రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement