రైతులను దోపిడీ చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులను దోపిడీ చేయొద్దు

May 15 2026 12:07 PM | Updated on May 15 2026 12:07 PM

బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి

నియోజకవర్గంలోని

కొనుగోలు కేంద్రాల పరిశీలన

మోర్తాడ్‌(బాల్కొండ): ధాన్యం సేకరణ ప్రక్రియలో తరుగు పేరుతో రైతులను నిలువుదోపిడీ చేయొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తమ హయాంలో తరుగు అనే పదం లేకుండా ధాన్యం సేకరించి రైతులకు ఎంతో న్యాయం చేశామని పేర్కొన్నారు. బా ల్కొండ నియోజకవర్గంలోని దూద్‌గాం, రెంజర్ల, నాగంపేట్‌, చౌట్‌పల్లి, పిప్రి కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన సందర్శించారు. గన్నీ సంచులు లేకపోవడంతో ధాన్యం ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో కలెక్టర్‌ త నకు స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయి లో మాత్రం ధాన్యం అలాగే ఉందని ఆరోపించారు. అలాగే మక్కల కొనుగోళ్ల విషయంలో నూ నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. జిల్లా సరిహ ద్దు గ్రామమైన దూద్‌గాంపై నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. నిర్లక్ష్యాన్ని వీడకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement