మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలోని డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లికి చెందిన మొద్దు గంగాధర్ స్టీల్ ఫిక్సర్‌గా పని చేసేందు కు ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీన దుబాయికి వెళ్లాడు. ఈనెల 4న కనిపించకుండా పోయిన అతడి ఆచూకీ 7వ తేదీన లభించింది. గంగాధర్ దుబాయికి వెళ్లక ముందు డైజోఫాం, క్లోరోఫామ్, అల్ప్రా జోలం వంటి మత్తు పదార్థాలు కలిపిన కల్లును సేవించేవాడని తెలిసింది. ఉన్నట్టుండి కల్లుకు దూరం కావడంతో మానసిక అస్థిరతకు గురయ్యాడు. ప్రస్తుతం అతడు దుబాయిలో సొంత బావమరిది భానుచందర్ సంరక్షణలో ఉన్నాడు. పనిచేసే పరిస్థితిలో లేని గంగాధర్‌ను తిరిగి ఇంటికి పంపిస్తే డీ అడిక్షన్ సెంటర్‌కు తీసుకువెళ్లి చికిత్స చేయించుకుంటామని కుటుంబ సభ్యులు అంటున్నారు.
ఈ పరిస్థితి ఒక్క గంగాధర్‌కు ఎదురైంది కాదు. ఎంతో మంది స్వగ్రామంలో ఉన్నప్పు డు మత్తు పదార్థాలు కలిపిన కల్లును సేవిస్తూ గల్ఫ్ దేశాలకు వెళ్లిన తరువాత మానసిక అస్థిరతకు గురవుతున్నారు. పనిచేసే చోటు లేదా ని వాసం ఉన్న చోటు నుంచి కనిపించకుండా పో తున్నారు. మరి కొందరైతే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నా రు. ఇటువంటి కేసులు వందల సంఖ్యలో న మోదవుతున్నాయి. ఇక్కడ మత్తుకు బానిసలై గల్ఫ్ వెళ్లిన తరువాత వారి జీవితాలు గతి తప్పుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, ని ర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన వందలాది మంది కొన్ని రోజులపాటు కనిపించకుండా పోవడం, మరికొందరు ఏదో ఒక విధంగా మరణించడం వంటి ఘటనలు చోటు చేసు కున్నాయి. గల్ఫ్ వెళ్లే ముందు మెడికల్ టెస్టులు చేయించుకుంటున్నా తమలోని లోపాలను బయటపడనివ్వకుండా కొంత మంది మేనేజ్ చేసుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు విధా నం వల్ల వలస కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
స్వగ్రామంలో కల్తీ కల్లుకు అలవాటుపడి గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు
మానసిక అస్థిరతకు గురై
తప్పిపోతున్న వారు కొందరు..
బలవన్మరణాలకు
పాల్పడుతున్న ఇంకొందరు


