రైతు డిక్లరేషన్‌ హామీలన్నీ అమలు చేస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

రైతు డిక్లరేషన్‌ హామీలన్నీ అమలు చేస్తున్నాం

May 8 2026 1:07 PM | Updated on May 8 2026 1:07 PM

నందిపేట్‌ (ఆర్మూర్‌): ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేష్‌ రెడ్డి అన్నారు. నందిపేట మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియను తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతోందని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నగేష్‌ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం పరితపిస్తుందన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ, రైతు భరోసాతోపాటు మరెన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు డిక్లరేషన్‌ హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, గత ప్రభుత్వ పాలనలో హామీలు తప్ప పేదలకు ఇళ్ల నిర్మాణాలు జరగలేదన్నారు. ఆయన వెంట ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌ కుమార్‌ రెడ్డి, సర్పంచ్‌ సిలిండర్‌ లింగం, సొసైటీ చైర్మన్‌ మీసాల సుదర్శన్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మంద మహిపాల్‌ తదితరులు ఉన్నారు.

డీసీసీ అధ్యక్షుడు నగేష్‌ రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement