కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి

May 16 2026 3:01 AM | Updated on May 16 2026 3:01 AM

ఓఆర్‌ఆర్‌, బైపాస్‌ రోడ్డు మంజూరు చేయించడంలో విఫలం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ పటేల్‌ కులాచారి

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌కు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు, బైపాస్‌ రోడ్డు హామీని అమలు చేయించడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ పటేల్‌ కులాచారి డిమాండ్‌ చేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం హామీ అమలు కాకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సొంత పార్టీ కార్యాలయం కోసం నగర నడిబొడ్డున స్థలాన్ని కేటాయించుకున్న వారు.. ప్రజలకు ఉపయోగపడే బస్టాండ్‌ కోసం మాత్రం స్థలాన్ని గుర్తించలేకపోయారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మధ్య కమీషన్ల బేరసారాలు కుదరకనే నిజామాబాద్‌ ఓఆర్‌ఆర్‌ ఫైలును పక్కన పడేశారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇందూరు గడ్డపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ కార్పొరేటర్లు, మేయర్‌ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఫ్లోర్‌ లీడర్‌ ప్రమోద్‌కుమార్‌, రూరల్‌ కన్వీనర్‌ పద్మారెడ్డి, కార్పొరేటర్లు మహేందర్‌, ఎర్రం సుధీర్‌, మల్లేష్‌ యాదవ్‌, వేణుగోపాల్‌, శ్రీనివాస్‌రెడ్డి, చిరంజీవి, బద్దం కిషన్‌, ఆమంద్‌ విజయ్‌కృష్ణ, బోడ మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement