రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని కుప్రియాల్ స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు శుక్రవారం రాత్రి దుర్మరణం చెందాడు. మండల కేంద్రానికి చెందిన అనంతసేన కృష్ణ(36) ద్విచక్ర వాహనంపై కామారెడ్డి నుంచి స్వగ్రామమైన సదాశివనగర్‌కు వస్తున్నాడు. అదే సమయంలో కుప్రియాల్ నుంచి వడ్ల లోడ్‌తో వస్తున్న లారీ కామారెడ్డికి వెళ్లేందుకు యూటర్న్ అవుతుండగా లారీకి తాకడంతో ద్విచక్రవాహనంతో లారీ కిందికి దూసుకెళ్లాడు. దీంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లావణ్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.
డీసీఎం బోల్తా
● డ్రైవర్ దుర్మరణం
కామారెడ్డి క్రైం: ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొని డీసీఎం వ్యాన్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గాంధారికి చెందిన సుప్పని నవీన్ (30) డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మక్కల లోడ్‌ను అన్‌లోడ్ చేసుకొని హైదరాబాద్ వైపు నుంచి గాంధారి వైపు తిరిగి వస్తుండగా డీసీఎం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.


