● సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల స్ఫూర్తితో ఐక్యంగా ఉద్యమిద్దాం
● జిల్లాకేంద్రంలో వామపక్ష సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం
ఖలీల్‌వాడి: తెలంగాణ యూనివర్సిటీ భూములను రక్షించుకుంటామని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నా యకులు అన్నారు. సెలవు రోజుల్లో విద్యార్థులు లే ని సమయంలో యూనివర్సిటీ భూములను బదిలీ చేయడం కుట్రగా కనిపిస్తుందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముకోవాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులు, ప్రజలు ఉద్య మాలతో బుద్ధి చెప్పారన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. నగరంలోని ఆ ర్‌ఆండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం పీడీఎస్‌యూ, టీయూసీఐ, పీఓడబ్ల్యూ, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ అధ్యక్షత వహించారు. సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాలకు పైగా భూ మిని మరో యూనివర్సిటీకి చెందిన కాలేజీకి ఇవ్వ డం సరైన నిర్ణయం కాదన్నారు. ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీ భూములు తరచూ కబ్జాలకు గురవుతున్నాయన్నారు. యూనివర్సిటీ భూముల పై సర్వే నిర్వహించి, రక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ కాలేజీ కోసం అన్ని రకాల సౌకర్యాలతో జక్రాన్‌పల్లి మండలంలో భూములు ఉన్నాయన్నారు. అక్కడ ఏర్పాటు చేస్తే జిల్లా రైతాంగానికి, విద్యార్థులకు ఉపయోగకరమన్నారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణ యూనివర్సిటీని సాధించుకున్నామని, యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం మరోసారి ఐక్య పోరాటాలకు సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. ఆయా సంఘాల ప్ర తినిధులు గణేష్, అనిల్ కుమార్, విగ్నేష్, శ్రీశైలం, గోపాల్, శ్రీధర్, సుజాత, శివరాజ్ పాల్గొన్నారు.


