ఇసుక ట్రాక్టర్ల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

May 15 2026 12:37 PM | Updated on May 15 2026 12:37 PM

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత డివైడర్‌ను ఢీకొన్న కారు

నిజాంసాగర్‌(జుక్కల్‌): మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ట్రాక్టర్లను గురువారం ఉదయం పట్టుకొని సీజ్‌ చేసినట్లు ఎస్సై శివకుమార్‌ తెలిపారు. మండలంలోని మాగి, అచ్చంపేట గ్రామ శివారుల్లోని మంజీరా నది నుంచి నిజాంసాగర్‌కు ఇసుకను తరలిస్తుండగా ట్రాక్టర్లను పట్టుకున్నామని చెప్పారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు వారిపైన కేసు నమోదు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల అనుమతుల పేరిట అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

ఇద్దరికి గాయాలు

రుద్రూర్‌: కోటగిరి మండలం ఎత్తొండ గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కోటగిరికి చెందిన సాత్విక్‌, సాయిలు కారులో ప్రయాణిస్తుండగా ఎత్తొండ క్యాంపు సమీపంలో అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement