దోమల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

దోమల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి

May 17 2026 7:32 AM | Updated on May 17 2026 7:32 AM

● డీఎంహెచ్‌వో రాజశ్రీ

● జాతీయ డెంగీ దినోత్సవ అవగాహన ర్యాలీ

సుభాష్‌నగర్‌ : దోమల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని డీఎంహెచ్‌వో రాజశ్రీ తెలిపారు. శనివారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా నగరంలోని చంద్రశేఖర్‌ కాలనీ పట్టణ ఆరో గ్య కేంద్రం పరిధిలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఐక్యత, ఆచరించు, నిర్మూలించు అనే నినాదంతో ఏడాది పొడవునా డెంగీ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జి ల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి అశోక్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో సికందర్‌ నాయక్‌,ప్రోగ్రాం అధికారులు వెంకన్న,సుప్రియ,మెడికల్‌ ఆఫీసర్‌ కీర్తి, వైద్యసి బ్బంది,ఏఎన్‌ఎంలు,ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.

మాతృ మరణాలపై సమీక్ష..

నగరంలోని కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో రాజశ్రీ మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. గర్భిణుల పేర్లను 12 వారాల్లోపు నమోదు చేయడమే కాకుండా నాలుగుసార్లు వైద్యులతో పరీక్షించేలా చూడాలని తెలిపారు. ధనుర్వాతం రాకుండా టీకాలు ఇప్పించాలని, ప్రమాదకర లక్షణాలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు రవీందర్‌, సికందర్‌ నాయక్‌, సమత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement