● పెద్ద పోచమ్మ గుడి వద్ద వాటర్ లీకేజీ
అవుతోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు.
– ప్రభాకర్‌రెడ్డి – 44వ డివిజన్,
రమేశ్–25వ డివిజన్, రాజశేఖర్ – ఐదో డివిజన్
మేయర్ : నగరంలో లీకేజీలను అరిట్టేందుకు ఇంజినీరింగ్ విభాగం ప్రత్యేక దృష్టిసారించింది. పెద్ద పోచమ్మ గుడి వద్ద లీకేజీ సమస్య నా దృష్టిలో కూ డా ఉంది. లీకేజీ ఏర్పడిన ఏరియాలో నీరు తక్కువగా వస్తున్నట్లు తెలిసింది. నగరంలో ఎక్కడైనా పైప్‌లైన్ లీకేజీలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించా.
● నాగారం ప్రాంతంలో పైపులైన్ వేసి కనెక్షన్
ఇవ్వలేదు – షేక్ అలీముద్దీన్, 10వ డివిజన్
● నీటి సరఫరా లేని ఏరియాల్లో నల్లా కనెక్షన్ ఇచ్చి సరఫరా చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించాం. సమస్యను ఇంజినీరింగ్ విభాగం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. నీటి కనెక్షన్, సరఫరా చేయకపోవడానికి కారణాలు అడిగి తెలుసుకుంటా.
● మా కాలనీలకు ఒక్కోసారి కలుషిత నీరు సరఫరా అవుతోంది. అధికారులకు తెలిపినప్పుడు మంచిగా వస్తున్నాయి. – ప్రశాంత్ – పోచమ్మగల్లి,
నవీన్ – దుబ్బ, రవీందర్ – పెద్దబజార్
● కొన్ని డివిజన్‌లలో కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాం. మురుగుకాల్వలకు దగ్గరగా ఉన్న పైప్‌లైన్‌లను మార్చాలని ఆదేశించాం. నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని అధికారులకు సూచించాను.
● తాగునీటి ఎద్దడి, పైప్‌లైన్ల లీకేజీలతోపాటు 24వ డివిజన్ పద్మానగర్‌లో చెత్తను ఎప్పటికప్పుడు తీసేయడం లేదని, 17వ డివిజన్‌లో విద్యుత్‌దీపాలు లేవని, నాగారంలో రాజీవ్ స్వగృహ, ఇతర కాలనీల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని, స్తంభాలు లేక తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని ఆయా కాలనీల నుంచి స్థానికులు సాక్షి ‘ఫోన్ ఇన్’ ద్వారా మేయర్ దృష్టికి సమస్యలను తెచ్చారు. చెత్తను తొలగించేలా సంబంధిత అధికారులను ఆదేశిస్తామని ఫిర్యాదుదారుడితో మేయర్ అన్నారు. అలాగే అన్ని డివిజన్‌ల విద్యుత్ దీపాలకు సంబంధించి పాత టెండర్ ముగిసిందని, కొత్త టెండర్లను ఆహ్వానించామని, టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత విద్యుత్ బల్బులు బిగిస్తారని సమాధానమిచ్చారు. రాజీవ్ స్వగృహ, కాలనీల్లో విద్యుత్ సరఫరా గురించి ఎన్‌పీడీసీఎల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని మేయర్ తెలిపారు.
నగరవాసుల సమస్యలు తెలుసుకుంటున్న మేయర్ ఉమారాణి
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. సుమారు రెండు నెలలకు అవసరమైన నీటి నిల్వలు అలీసాగర్, మాసాని, మంచిప్ప చెరువులో ఉన్నాయి. అప్పుడప్పుడు ఏర్పడుతున్న పైప్‌లైన్ లీకేజీల కారణంగా కొంతవరకు సమస్య ఉన్నట్లు నా దృష్టిలో ఉంది. లీకేజీలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టిసారించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించాం. అమృత్ 2.0 పనులు పూర్తయితే నగరానికి 365 రోజులు ఎలాంటి కొ రత లేకుండా నీటిని పుష్కలంగా సరఫరా చేయొచ్చు. నాణ్యత పా టిస్తూ వేగవంతంగా పనులు చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించా’ అని నగర మేయర్ కూరగాయల ఉమారాణి తెలిపారు. నగర మేయ ర్‌తో ‘సాక్షి’ ఆదివారం ఫోన్ ఇన్ నిర్వహించింది. – సుభాష్‌నగర్
నగరవాసుల అవసరానికి
సరిపడా నీటి నిల్వలు
లీకేజీలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి
అమృత్ 2.0 పూర్తయితే పుష్కలంగా
నీటి సరఫరా
‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో నగర మేయర్
కూరగాయల ఉమారాణి


