బైపాస్‌లో హనీట్రాప్‌ | - | Sakshi
Sakshi News home page

బైపాస్‌లో హనీట్రాప్‌

May 11 2026 7:20 AM | Updated on May 11 2026 7:20 AM

భార్యాభర్తలను

అరెస్ట్‌ చేసిన పోలీసులు

రిమాండ్‌కు తరలింపు

నిజామాబాద్‌ రూరల్‌: ద్విచక్ర వాహనదారులను హనీట్రాప్‌ చేసి డబ్బులు గుంజుతున్న భార్యాభర్తలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని నాందెడ్‌ జిల్లాకు చెందిన భార్యాభర్తలు మాధవనగర్‌ ప్రాంతంలో ఉంటున్నారు. ఈజీగా డబ్బుల సంపాదించాలనే ఆలోచనతో హనీట్రాప్‌ పతకాన్ని అమలు చేశారు. మాధవనగర్‌ బైపాస్‌ రోడ్డులో భార్య నిల్చుని ద్విచక్ర వాహనదారులను ఆకర్షిస్తూ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్తే వెనకాలే భర్త వచ్చి బెదిరిస్తాడు. వాహనదారుల వద్ద ఉన్న డబ్బులను లాక్కుని ఎవరికై నా చెబితే రేప్‌ కేసు పెడతామని బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి సైతం ఓ వాహనదారుడిని ట్రాప్‌ చేయగా గూపన్‌పల్లి శివారులో భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆర్మూర్‌ బైపాస్‌ రోడ్డులో సైతం పలువురిని భార్యాభర్తలు బెదిరించినట్లు తెలిసింది.  

జానపద కళోత్సవ్‌ను

విజయవంతం చేయాలి

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లాకేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో ఈనెల 24 నిర్వహించనున్న జానపద కళోత్సవ్‌ – 2026ను విజయవంతం చేయాలని ప్రజానాట్య మండలి జిల్లా కన్వీనర్‌ సిర్ప లింగం కోరారు. నగరంలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌ కార్యాలయంలో సాహితీ సాంస్కృతిక సంస్థల నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కళాకారుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జానపద కళోత్సవ్‌పై, కళారూపాల ప్రదర్శనలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రచ్చ నరేశ్‌, రాధ కిషన్‌, రాజు, క్రాంతి, శ్రీనివాస్‌, విజయమల, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement