ఎస్‌ఆర్‌ విజయఢంకా | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌ విజయఢంకా

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

ఖలీల్‌వాడి: ఎప్‌సెట్‌లో ఫలితాల్లో నిజామాబాద్‌ ఎస్‌ఆర్‌ కాలేజీ విద్యార్థులు విజయభేరి మోగించినట్లు ఎస్‌ఆర్‌ డీజీఎం గోవర్ధన్‌రెడ్డి, జోనల్‌ ఇంచార్జి శ్రీకాంత్‌ తెలిపారు. ఇంజినీరింగ్‌ విభాగంలో జె.గురుమోహన్‌చరణ్‌ (369), ఎం.నివాస్‌(2,824), ఆర్‌.అభినయ్‌ (3194), ఎ.చరణ్‌తేజ(3200), డి. వర్షత్‌ (4114), బి.వాగ్మీ (4181)లు సాధించగా 5 వేల ర్యాంకులు ఆరుగురు విద్యార్థులు, 10 వేల ర్యాంకులు 17 మంది, 15 వేల ర్యాంకులోపు 71 మంది, 20 వేల లోపు ర్యాంకులు 139 మందికి వచ్చినట్లు తెలిపారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో జె.శ్వేత(351), పి.సాయిరుద్రాతేజ(1677), పి.హన్మిత(2182), పి.రాహుల్‌ ఆదిత్య(2491), జి.సరిత(4303), ఆర్‌. రిషిక్‌(4308), ఎల్‌. సిమిలిత(4623) సాధించగా 5 వేల లోపు ఏడుగురు, 10 వేల లోపు 17 మంది, 15 వేల లోపు 64 మంది, 20 వేల లోపు 102 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. ఎప్‌సెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. అనంతరం ఎస్‌ఆర్‌ డీజీఎం గోవర్ధన్‌రెడ్డి, జోనల్‌ ఇంచార్జి శ్రీకాంత్‌ మాట్లాడుతూ అధ్యాపకుల ద్వారా అప్‌డేట్‌ మెటీరియల్‌తోపాటు ప్రత్యేక క్లాసులు తీసుకోవడంతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. ఎస్‌ఆర్‌ చైర్మన్‌ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, సీఈవో సురేందర్‌రెడ్డి విద్యార్థులను అభినందించారు. అకడమిక్‌ డీన్‌ రాంబాబు, ప్రిన్సిపాళ్లు ఆగేందర్‌రెడ్డి, హన్మంత్‌రా వు, శ్రీధర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, మహిపాల్‌ రెడ్డి, ము రళీధర్‌, నర్సింహారెడ్డి, జోనల్‌ అకౌంటెంట్‌ ఆఫీసర్‌ రమేశ్‌రెడ్డి, తల్లిదండ్రులు, లెక్చరర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement