● సమష్టిగా విద్యా వారోత్సవాలను
నిర్వహించాలి
● జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధా న్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ధాన్యం కొనుగో లు, ఫార్మర్ రిజిస్ట్రీ, జనాభా గణన, విద్యా వారోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా సమీక్షించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ అన్ని జిల్లాలలో వంద శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ కు ఒక్క రోజే మిగిలి ఉండడంతో ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో పది లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వీరంతా స్వీ య గణన చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 11 నుంచి నిర్వహించే విద్యా వా రోత్సవాలను విజయవంతం చేయాలని సీఎస్ దిశా నిర్దేశం చేశారు. వీసీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు కీలక సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటే వెంటనే తూ కం జరిపించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం లోడింగ్ అన్‌లోడింగ్ లో జాప్యం జరగకుండా సరిపడా సంఖ్యలో హమాలీలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, వారికి భోజన సౌకర్యం కల్పించాలని కలెక్టర్ సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ పరిస్థితుల గురించి రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. జనాభా గణన ప్రక్రియలో భాగంగా కొనసాగుతున్న స్వీయ నమోదును అన్ని వర్గాల వారు స్వీయ గణన చేసుకునేలా కషి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ, ఆశా వర్కర్లను కూడా భాగస్వాములు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న విద్యా వారోత్సవాలను షె డ్యూల్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, వి ద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై ఆసక్తిని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ జిల్లాలో వంద శాతం పూర్తయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ప్రవీణ్, డీఆర్డీవో సాయన్న, డీఏవో వీరస్వామి, డీఈవో అశోక్, డీసీవో శ్రీనివాస్, ఏఎస్‌వో అరవింద్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.


